లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Viral

రోడ్డు పై బస్సును ఆపి అరటిపండ్లు దొంగలించిన ఏనుగు…వైరల్ వీడియో

Published

on

Elephant stop bus to steal bananas : దొంగలు దారికాచి మరీ దోపిడి చేస్తారనే విషయం తెలిసిందే. కానీ, ఇక్కడ వైరైటీగా ఓ ఏనుగు దొంగతనం చేసింది. ఏనుగేంటీ దొంగతనం ఏంటీ అంటే నమ్మలేం కదూ..అవును నిజమేనండీ… ఓ ఏనుగు సినిమా స్టైల్ ల్లో రోడ్డుకు అడ్డంగా వచ్చి ఆ దారిలో వెళ్తున్న ఓ బస్సుకు అడ్డంగా వచ్చి ఆపింది. అంత పెద్ద ఏనుగుు అడ్డంగా వస్తే బస్సు డ్రైవర్ మాత్రం ఏంచేస్తాడు పాపం..సడెన్ బ్రేక్ వేసి ఆపేశాడు. ఆ తరువాత ఏనుగు చేసిన హంగామా మామూలుగా లేదు. ఆ బస్సులో ఉన్న అరటిపండ్లును ఎంత దౌర్జన్యంగా దోచుకుందో చూస్తే ఔరా..ఏమీ ఈ గజరాజు తెగువ.. అనిపిస్తుంది. ఏనుగుకి అరటిపళ్లు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఏనుగు అరటిపండ్లు చోరీ వీడియో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.వివరాల్లోకి వెళ్తే… శ్రీలంకలోని ‘కటరంగమా’ ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సును ఏనుగు రోడ్డుకు అడ్డంగా నిలబడి ఆపేసింది. అప్పటికే మంచి ఆకలితో ఉన్న ఏనుగు వాహనం ఆగగానే డ్రైవర్ కిటికీలో నుంచి తొండాన్ని లోపలికి చాచి దొరికిన బియ్యాన్ని, అరటిపండ్లును లాగేసింది. దీంతో పక్కనున్న ఓ ప్రయాణికుడు బెంబేలెత్తిపోయి మిగిలి ఉన్న అరటిపళ్ళ గెలను ఏనుగుకు అందించాడు.ఈ క్రమంలోనే ఏనుగు తొండం డ్రైవర్ మెడకు చుట్టుకుని బిగుసుకున్నట్లు కనిపిస్తుంది. దాని నుంచి విడిపించుకోవడానికి ఆ డ్రైవర్ నానా తంటాలు పడ్డాడు. చివరకు ఆ ఏనుగు అవసరమైన అరటిపండ్లును ఇచ్చి విడిపించుకున్నాడు. ఆ ఏనుగు కూడా తనకు కావాల్సిన అరటిపండ్లును తీసుకుని వారిని విడిచి పెట్టింది. దీంతో ఆ డ్రైవర్ బతకుజీవుడా అంటూ ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని అక్కడి నుంచి వాహనాన్ని నడుపుకుంటూ వెళ్లిపోయాడు.ఇండియన్ ఫారెస్టు ఆఫీసర్ పర్వీన్ కస్వాన్ ఈ వీడియోని ట్విట్టర్ లో పోస్టు చేశారు. కొద్ది నిమిషాల్లోనే 2.5 లక్షలకు పైగా వ్యూస్ ని సంపాదించుకుంది. ఈ వీడియో రెండేళ్ల క్రితం నాటిదే అయిన మళ్లీ పర్వీన్ కస్వాన్ షేర్ చేయటంతో వైరల్ గా మారింది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *