Viral Video: గర్భంతో ఉన్న కుక్కను తీవ్రంగా కొట్టిన కాలేజీ విద్యార్థులు.. వీడియో వైరల్

గర్భంతో ఉన్న కుక్కను తీవ్రంగా కొడుతూ హించించారు కాలేజీ విద్యార్థులు. కుక్కను కొడుతున్న సమయంలో గట్టిగా నవ్వుతూ రాక్షసానందం పొందారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. న్యూఢిల్లీలోని ఓఖ్లా రోడ్ జామియా నగర్ లోని డాన్ బాస్కో టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్ కు చెందిన నలుగురు విద్యార్థులు న్యూ ఫ్రెండ్స్ కాలనీ ప్రాంతంలోకి బేస్ బాల్ బ్యాట్లు, ఇనుప రాడ్లతో వచ్చి, గట్టిగా నవ్వుతూ ఓ గుడిసెలో ఉన్న కుక్కను కొట్టారు.

Viral Video: గర్భంతో ఉన్న కుక్కను తీవ్రంగా కొట్టిన కాలేజీ విద్యార్థులు.. వీడియో వైరల్

Viral Video: గర్భంతో ఉన్న కుక్కను తీవ్రంగా కొడుతూ హించించారు కాలేజీ విద్యార్థులు. కుక్కను కొడుతున్న సమయంలో గట్టిగా నవ్వుతూ రాక్షసానందం పొందారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. న్యూఢిల్లీలోని ఓఖ్లా రోడ్ జామియా నగర్ లోని డాన్ బాస్కో టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్ కు చెందిన నలుగురు విద్యార్థులు న్యూ ఫ్రెండ్స్ కాలనీ ప్రాంతంలోకి బేస్ బాల్ బ్యాట్లు, ఇనుప రాడ్లతో వచ్చి, గట్టిగా నవ్వుతూ ఓ గుడిసెలో ఉన్న కుక్కను కొట్టారు.

చివరకు ఆ కుక్క మృతి చెందింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఆ నలుగురు విద్యార్థులను అరెస్టు చేశారు. ఆ కుక్క ప్రతిరోజు మొరుగుతుండడంతో చిరాకు వచ్చిందని, అందుకే దాన్ని కొట్టామని ఆ విద్యార్థులు పోలీసులకు చెప్పారు.

మూగజీవాలను హింసిస్తూ వీడియోలు తీసుకున్న ఘటనలు గతంలోనూ చోటుచేసుకున్నాయి. అటువంటి ఘటనలకు పాల్పడుతున్న వారిపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ కొందరు తమ తీరు మార్చుకోకుండా మూగజీవాలను హింసిస్తున్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..