Beer Shower : పిచ్చి పీక్స్..‍! బీర్‌తో పెళ్లికొడుక్కి మంగళస్నానం, సంప్రదాయాన్ని కించపరిచారంటూ జనాల ఆగ్రహం

Beer Shower : ఇదేం సంప్రదాయం అంటూ ఫైర్ అవుతున్నారు. కామెడీకి కూడా ఇలాంటివి ఎంకరేజ్ చేయడం సరికాదంటున్నారు. పిచ్చి కానీ పట్టిందా? అని సీరియస్ అవుతున్నారు.

Beer Shower : పిచ్చి పీక్స్..‍! బీర్‌తో పెళ్లికొడుక్కి మంగళస్నానం, సంప్రదాయాన్ని కించపరిచారంటూ జనాల ఆగ్రహం

Beer Shower

Nagar Kurnool – Beer Shower : సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనో, ఒక్కరోజులో పాపులార్ అయిపోవాలనో.. తెలియదు కానీ.. కొందరు వ్యక్తులు దిగజారిపోతున్నారు. పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నారు. ఫలితంగా.. పాపులారిటీ సంగతి పక్కన పెడితే తీవ్ర విమర్శల పాలవుతున్నారు. జనాలతో తిట్లు తింటున్నారు. తాజాగా నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన ఓ ఘటన అందరినీ షాక్ కి గురి చేసింది. ఇలా తయ్యారేంటి రా బాబూ అని తల పట్టుకునేలా చేసింది. ఇంతకీ వారు ఏం చేశారో తెలుసా.. బీర్ తో మంగళస్నానం చేయించారు.

నాగర్ కర్నూల్ జిల్లా ఐతోల్ గ్రామంలో జరిగిన ఓ హల్దీ ఫంక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అదే సమయంలో తీవ్ర విమర్శలకు తావిచ్చింది. సాధారణంగా మంగళస్నానం అంటే పసుపు నీళ్లతో చేయిస్తారు. కానీ, వారు ఏకంగా బీరుతో మంగళస్నానం చేయించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Also Read..Viral Video : మహిళలూ.. బైక్ నడిపేటప్పుడు జాగ్రత్త.. రెప్పపాటులో ఎంత ఘోరం జరిగిందో చూడండి..

వాళ్లు వెరైటీ కోసం ఇలా చేశారో లేక పాపులారిటీ కోసం చేశారో తెలియదు కానీ.. తీవ్రంగా విమర్శలైతే వస్తున్నాయి. వారు చేసిన పనిని అంతా తప్పుపడుతున్నారు. అత్యంత పవిత్రంగా జరగాల్సిన మంగళస్నానం బీరుతో చేయించడం దారుణం అంటున్నారు. పెళ్లి కార్యక్రమం రోజురోజుకు కొత్త పోకడలకు దారితీస్తోందని, ఇది కరెక్ట్ కాదని మండిపడుతున్నారు. ఇదేం సంప్రదాయం అంటూ ఫైర్ అవుతున్నారు. కామెడీకి కూడా ఇలాంటివి ఎంకరేజ్ చేయడం సరికాదంటున్నారు.

ఈ రోజుల్లో.. కాస్త వెరైటీ కోసమో, ట్రెండ్ కోసమో పెళ్లి వేడుకలు కొత్త పుంతలు తొక్కడం కామన్ గా మారింది. ఫొటో షూట్ల దగ్గరి నుంచి పెళ్లితంతు వరకు ప్రతిదీ కొత్తగా ఉండాలనే ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో సంప్రదాయాలకి విరుద్ధంగా వ్యవహరిస్తూ విమర్శల పాలవుతున్నారు. పెళ్లి అంటూ ఎంతో పవిత్రంగా, పూర్తి సంప్రదాయబద్ధంగా జరగాల్సిన తంతు అని పెద్దలు గుర్తు చేస్తున్నారు.

Also Read..Viral Video : మార్నింగ్ వాక్ చేస్తున్న మహిళకు ఊహించని షాక్.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

మంగళస్నానం.. పెళ్లి వేడుకలో అత్యంత ముఖ్యమైన, పవిత్రమైన కార్యం అని, అలాంటిది బీరుతో మంగళస్నానం చేయించడం సంప్రదాయానికి విరుద్ధం అంటున్నారు. ఇలా చేయడం అపవిత్రం అంటున్నారు. ఇలాంటి వాటిని ఎవరూ ప్రోత్సహించవద్దని పెద్దలు సూచిస్తున్నారు. ఇన్ స్టా రీల్స్, వాట్సాప్ స్టేటస్ ల కోసం ఇలాంటి పిచ్చి పనులు చేయడం మన సంప్రదాయాన్ని మనమే కించపరుచుకున్నట్లు అవుతుందని హితబోధ చేస్తున్నారు.