Teachers Fighting : వామ్మో.. వీళ్లు టీచర్లా? వీధి రౌడీలా? ప్రిన్సిపాల్‌ జట్టు పట్టుకుని పిచ్చకొట్టుడు కొట్టిన మహిళా ఉపాధ్యాయులు

Viral Video : ఇద్దరు మహిళా టీచర్లు రెచ్చిపోయారు. స్కూల్ ప్రిన్సిపాల్ పై దాడి చేశారు. ప్రిన్సిపాల్ జట్టు పట్టుకుని చెప్పుతో కొట్టారు

Teachers Fighting : వామ్మో.. వీళ్లు టీచర్లా? వీధి రౌడీలా? ప్రిన్సిపాల్‌ జట్టు పట్టుకుని పిచ్చకొట్టుడు కొట్టిన మహిళా ఉపాధ్యాయులు

Teachers Fighting (Photo : Google)

Viral Video : గురువుని దైవంతో సమానంగా చూస్తారు. ఎందుకంటే పిల్లలకు విద్యాబుద్ధులతో పాటు సంస్కారం నేర్పేది గురువే. మంచి చెడులు వివరించి సన్మార్గంలో వెళ్లేలా చూస్తారు. అందుకే ఉపాధ్యాయులకు అంత గౌరవం. అంతేకాదు ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. అయితే, ఇద్దరు టీచర్లు తమ ప్రవర్తనతో పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చారు. వారి తీరు షాక్ కి గురి చేసింది. వామ్మో.. వీళ్లు టీచర్లా? వీధి రౌడీలా? అనే అనుమానం కలిగించింది.

ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఇద్దరు మహిళా టీచర్లు రెచ్చిపోయారు. క్లాస్ రూమ్ లోనే, పిల్లల ముందే బరితెగించారు. స్కూల్ ప్రిన్సిపాల్ పై దాడి చేశారు. ప్రిన్సిపాల్ జట్టు పట్టుకుని చెప్పుతో చితక్కొట్టారు. ఈ షాకింగ్ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది.

Also Read..Goa Robbery : బీకేర్ ఫుల్.. ఇంటి బయట ఒంటరిగా కూర్చుంటున్నారా? ఎంత ప్రమాదమో చూడండి.. షాకింగ్ వీడియో

అది ప్రభుత్వ పాఠశాల. క్లాస్ రూమ్ లో ఇద్దరు టీచర్లకు, స్కూల్ ప్రిన్సిపాల్ కి మధ్య కిటికీ మూసివేత, అటెండెన్స్ విషయంలో గొడవ జరిగింది. మాటమాట పెరిగింది. అంతే, ఇద్దరు మహిళా టీచర్లు రెచ్చిపోయారు. కోపంతో ఊగిపోయారు. ప్రిన్సిపాల్ పై దాడికి దిగారు. ఆమె జట్టు పట్టుకుని కొట్టారు. తర్వాత కిందపడేసి చెప్పుతో చితకబాదారు. ఓ టీచర్ ఆవేశంగా ప్రిన్సిపాల్ మీదకు దూసుకెళ్లింది. దారుణంగా కొట్టింది. ప్రిన్సిపాల్ అని కూడా చూడకుండా పిచ్చకొట్టుడు కొట్టారు. తాము టీచర్లం, పిల్లలు చూస్తున్నారు.. అన్న కనీసం జ్ఞానం కూడా లేకుండా వారు రెచ్చిపోయారు. టీచర్ల ఫైటింగ్ చూసి పిల్లలు షాక్ అయ్యారు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసి అంతా నివ్వెరపోతున్నారు. వామ్మో.. వీళ్లు టీచర్లా? వీధి రౌడీలా? అనే అనుమానాన్ని నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. టీచర్లు ఇంత దారుణంగా కొట్టుకోవడం ఎక్కడా చూడలేదు అంటున్నారు. ఇలాంటి వాళ్లు గురువులుగా ఉంటే.. పిల్లలు ఏం బాగుపడతారని వాపోతున్నారు.

Also Read..Karnataka : OMG.. పెట్రోల్ బంకులో ఫోన్ వాడుతున్నారా? ఎంత ప్రమాదమో చూడండి.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో

పిల్లల ముందే ఇలా కొట్టుకోవడం క్షమించరాని నేరం అంటున్నారు. పిల్లలకు ఆదర్శంగా ఉండాల్సిన వారే.. ఇలా రోడ్డున పడి కొట్టుకోవడం దారుణం అంటున్నారు. అసలు, ఇలాంటి ప్రవర్తనతో పిల్లలకు ఏం మేసేజ్ ఇద్దామని? అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.