Viral Video: పెళ్లి కొడుకుతో రొమాంటిక్‌గా ఫొటో దిగుతూ కింద పడిపోయిన పెళ్లికూతురు

పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఓ ప్రత్యేకమైన రోజు. వివాహాన్ని జీవితాంతం తీపి జ్ఞాపకంగా గుర్తు పెట్టుకోవాలని వధూవరులు భావిస్తారు. రకరకాల పోజులతో ఫొటోలు దిగుతుంటారు. ఈ జంట కూడా అదే పని చేసింది. ఫొటోగ్రాఫర్ చెప్పినట్లు రకరకాల పోజులతో ఫొటోలు దిగుతోంది. అయితే, ఆ సమయంలో అమ్మాయిని పట్టుకుని రొమాంటిక్ గా ఫొటో దిగే క్రమంలో ఆమె దుస్తులు తగలడంతో వధువును వదిలేశాడు వరుడు. దీంతో ఆమె కిందపడిపోయింది.

Viral Video: పెళ్లి కొడుకుతో రొమాంటిక్‌గా ఫొటో దిగుతూ కింద పడిపోయిన పెళ్లికూతురు

Viral Video: పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఓ ప్రత్యేకమైన రోజు. వివాహాన్ని జీవితాంతం తీపి జ్ఞాపకంగా గుర్తు పెట్టుకోవాలని వధూవరులు భావిస్తారు. రకరకాల పోజులతో ఫొటోలు దిగుతుంటారు. ఈ జంట కూడా అదే పని చేసింది. ఫొటోగ్రాఫర్ చెప్పినట్లు రకరకాల పోజులతో ఫొటోలు దిగుతోంది. అయితే, ఆ సమయంలో అమ్మాయిని పట్టుకుని రొమాంటిక్ గా ఫొటో దిగే క్రమంలో ఆమె దుస్తులు తగలడంతో వధువును వదిలేశాడు వరుడు. దీంతో ఆమె కిందపడిపోయింది.

ఇంకాస్త అయితే వరుడు కూడా కింద పడిపోయేవాడే. ముందుకు కదిలి ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పెళ్లి కొడుకుతో రొమాంటిక్‌గా ఫొటో దిగుతూ పడిపోయిన పెళ్లికూతురు కూడా నవ్వు ఆపుకోలేకపోయింది. అయితే, కిందపడిపోయిన అవమానాన్ని ఎదుర్కోవడానికే పెళ్లి కూతురు నవ్విందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

పెళ్లి నాడే వధువును పడేశాడంటూ వరుడిపై సెటైర్లు వేస్తున్నారు. ఈ ఘటనతో పెళ్లి రోజును మరింత బాగా గుర్తుంచుకుంటారని నెటిజన్లు అంటున్నారు. పెళ్లికూతురు కింద పడిపోయిన దృశ్యాలకు సంబంధించిన ఈ వీడియోకు రెండున్నర కోట్ల వ్యూస్ వచ్చాయంటే ఈ వీడియో ఎంతగా వైరల్ అవుతుందో చెప్పొచ్చు.

 

View this post on Instagram

 

A post shared by Prewedding in jaipur (@jaipur_preweddings)

Metro Services: అర్థరాత్రి రెండు గంటల వరకు మెట్రో సేవలు.. కొత్త సంవత్సర వేడుకల కోసం సేవల పొడిగింపు