Youtuber Arrested: పైశాచిక ఆనందం.. కుక్కను గాల్లోకి ఎగరేసిన యూట్యూబర్

కొందరు వ్యక్తులు జంతువుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తుంటారు. జంతువులను హింసలు పెడుతుంటారు. కనికరం లేకుండా వాటి ప్రాణాలు కూడా తీస్తుంటారు. గతంలో కొందరు ఆకతాయిలు కుక్కపిల్లల్ని నిప్పుల్లో వేసి పైశాచిక ఆనందం పొందారు. మరోచోట కోతికి ఉరివేసి చిత్ర హింసలకు గురిచేసి చంపేశారు.

Youtuber Arrested: పైశాచిక ఆనందం.. కుక్కను గాల్లోకి ఎగరేసిన యూట్యూబర్

Youtuber Arrested

Youtuber Arrested: కొందరు వ్యక్తులు జంతువుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తుంటారు. జంతువులను హింసలు పెడుతుంటారు. కనికరం లేకుండా వాటి ప్రాణాలు కూడా తీస్తుంటారు. గతంలో కొందరు ఆకతాయిలు కుక్కపిల్లల్ని నిప్పుల్లో వేసి పైశాచిక ఆనందం పొందారు. మరోచోట కోతికి ఉరివేసి చిత్ర హింసలకు గురిచేసి చంపేశారు. ఇక తాజాగా ఓ యూట్యూబర్ తన పెంపుడు కుక్కపై పైశాచికంగా ప్రవర్తించాడు. దానికి హైడ్రోజన్ బెలూన్లు కట్టి గాల్లోకి ఎగరేశాడు.

బెలూన్లతోపాటు కుక్కకూడా పైకి వెళ్ళింది. కాగా ఈ ఘటన ఢిల్లీలోని మాలవ్యనగర్ లో చోటుచేసుకుంది. గౌరవ్ జాన్ అనే యూట్యూబర్ ఛానల్ వ్యూస్ కోసం కుక్కకు హైడ్రోజన్ బెలూన్స్ కట్టి గాల్లోకి ఎగరేశాడు. దాని బర్త్ డే సందర్బంగా ఈ విధంగా చేశాడు. ఇంట్లో.. బయట.. చాలాసార్లు కుక్కకు బెలూన్లు కట్టి గాల్లోకి వదిలారు. గాల్లోకి బెలూన్లతో పాటు కుక్క కూడా ఎగురుతుండంతో అతడు, అతడి తల్లి, కొందరు యువతులు కేరింతలు వేస్తూ పైశాచిక ఆనందం పొందారు.

దీనిని యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. దీనిని చూసిన కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు యూట్యూబర్ జాన్ తోపాటు అతడి తల్లిపై కూడా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కాగా వీరి చేష్టలపై జంతుప్రేమికులు మండిపడుతున్నారు. ఏదైనా జరగకూడదని జరిగితే కుక్క మృతి చెందుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిని కఠినంగా శిక్షించాలని వీడియో చూసిన వారిలో చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుక్కకు ఎటువంటి గాయాలు కాకపోయినా ఇటువంటివి చేయడం తగదని హెచ్చరిస్తున్నారు నెటిజన్లు.