Viral Video: చాక్లెట్ల జడతో అలంకరించుకున్న పెళ్లి కూతురు.. చాక్లెట్లతోనే నగలు.. వైరల్ అవుతున్న వీడియో

ఒక పెళ్లి కూతురు మాత్రం తన పెళ్లి నాటి జడ, జువెలరీ మొత్తం చాక్లెట్లతోనే తయారు చేయించుకుంది. వాటినే అందంగా అలంకరించుకుంది. జడ, నెక్లెస్, వడ్డాణం, చెవి దుద్దులు, రిస్ట్ బ్యాండ్.. ఇలా అన్నింటినీ చాక్లెట్లతోనే అలంకరించుకుంది.

Viral Video: చాక్లెట్ల జడతో అలంకరించుకున్న పెళ్లి కూతురు.. చాక్లెట్లతోనే నగలు.. వైరల్ అవుతున్న వీడియో

Viral Video: పెళ్లి కూతురు ముస్తాబంటే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. జడ, నగలు, చెవి కమ్మలు, వడ్డాణం వంటివన్నీ గోల్డ్‌తో మెరిసిపోతుంటాయి. రకరకాల డిజైన్లు, వజ్రాలు, పూసలు, రాళ్లతో అందంగా అలంకరించుకుంటారు. కానీ, ఒక పెళ్లి కూతురు మాత్రం తన పెళ్లి నాటి జడ, జువెలరీ మొత్తం చాక్లెట్లతోనే తయారు చేయించుకుంది.

Viral Video: ప్రేక్షకులకు షాకిస్తున్న సీరియల్స్.. ఈ సీన్ చూస్తే హడలే… ఏకంగా తాడుతో చంద్రుడ్నే కిందకు లాగారు..!

వాటినే అందంగా అలంకరించుకుంది. జడ, నెక్లెస్, వడ్డాణం, చెవి దుద్దులు, రిస్ట్ బ్యాండ్.. ఇలా అన్నింటినీ చాక్లెట్లతోనే అలంకరించుకుంది. ప్రస్తుతం ఈ పెళ్లి కూతురుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మేకప్ ఆర్టిస్ట్ చిత్ర దీనికి సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో ప్రకారం… ఒక పెళ్లి కూతురు తన జడను చాక్లెట్లతో తయారు చేయించుకుంది. ఫైవ్ స్టార్, మిల్కీ బార్, క్యాడ్బరీ, కిట్ క్యాట్, మ్యాంగో బైట్ వంటి అనేక రకాల చాక్లెట్లతో వీటిని తయారు చేయించుకుంది. మ్యాంగో బైట్ చాక్లెట్లతో చెవి కమ్మలు తయారు చేయించుకుంది.

Rains In Telangana: శని, ఆదివారాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

అలాగే క్యాడ్బరీ చాక్లెట్లతో రిస్ట్ బ్యాండ్, వడ్డాణం తయారు చేయించుకుంది. వీటిని అందంగా అలంకరించుకుని ఆ పెళ్లి కూతురు మురిసిపోయింది. అయితే, ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఆమె క్రియేటివిటీని మెచ్చుకుంటుంటే.. మరికొందరు ఇదేం పిచ్చి అంటూ తిట్టిపోస్తున్నారు. ఇంతకీ మీకేమనిపిస్తుందో ఈ వీడియో చూసి తెలుసుకోండి.

 

 

View this post on Instagram

 

A post shared by Niche Lifestyle (@nichelifestyle)