Viral Video: రోడ్డు దాటుతున్న చేపలు.. మన తెలంగాణలోనే అంటూ వైరల్!

చేపలు రోడ్డు దాటడం సాధారణంగా జరిగే పనికాదు. అదే రోడ్డుపై నీళ్లు పారుతుంటే చేపలు కూడా అందులో నుండి ఈదుకుంటూ వెళ్తాయి. సరిగ్గా ఇప్పుడు ఇంటర్నెట్ లో అలాంటి వీడియోనే ఒకటి హల్చల్ చేస్తుంది. తెలంగాణలో ఈ మధ్య కుండపోత వర్షాలు కురవడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

Viral Video: రోడ్డు దాటుతున్న చేపలు.. మన తెలంగాణలోనే అంటూ వైరల్!

Viral Video

Viral Video: చేపలు రోడ్డు దాటడం సాధారణంగా జరిగే పనికాదు. అదే రోడ్డుపై నీళ్లు పారుతుంటే చేపలు కూడా అందులో నుండి ఈదుకుంటూ వెళ్తాయి. సరిగ్గా ఇప్పుడు ఇంటర్నెట్ లో అలాంటి వీడియోనే ఒకటి హల్చల్ చేస్తుంది. తెలంగాణలో ఈ మధ్య కుండపోత వర్షాలు కురవడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎక్కడిక్కడ వరద నీరు రోడ్ల మీద కూడా కనిపించింది. ఇదే సమయంలో తెలంగాణలోనే రోడ్డు దాటుతున్న చేపలని ఓ వీడియో వైరల్ అయింది.

‘మనుషులే కాదు… చేపలు కూడా రోడ్లు దాటుతాయి’ అంటూ ఓ నెటిజన్ తెలంగాణలో ఇలా చేపలు రోడ్డు దాటినట్లుగా ఓ ట్వీట్ వీడియో షేర్ చేయగా.. ఇది కాస్త వైరల్ అయ్యింది. అయితే, నిజానికి ఇది తెలంగాణలో దృశ్యం కాదు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురవడం.. రోడ్ల మీద భారీ వరద నీరు కనిపించడం నిజమే కానీ.. ఈ నెటిజన్ చేసిన చేపలు రోడ్డు దాటడం మాత్రం తెలంగాణలోది కాదు.. అసలు ఇది ఇప్పటి దృశ్యమే కాదు.

ఇది 2016లో ఖుంగ్ పుతీశాక్ అనే యూట్యూబ్ క్రియేటర్ ఈ వీడియోని అప్‌లోడ్ చేశారు. ఈ వీడియోను షానన్ ఆడమ్ అనే మహిళ నుంచి తాను తీసుకున్నట్లు ఖుంగ్ తెలిపగా.. ఆమె ఫేస్ బుక్ లింక్ కూడా యూట్యూబ్ వీడియో కింద ఇచ్చారు. దాన్నే ఇప్పుడూ ఓ నెటిజన్ డౌన్ లోడ్ చేసుకొని తెలంగాణలోదిగా క్రియేట్ చేశారు. ఇది ఫేక్ న్యూస్ అయినప్పటికీ చేపలు అలా రోడ్డు దాటడం ముచ్చటగా ఉండడంతో నెటిజన్లు దీన్ని వీక్షిస్తున్నారు.