Viral Video: ఇలా కూడా బ్యాటింగ్ చేస్తారా.. ఇది కదా గల్లీ క్రికెట్ అంటే.. హిలేరియస్ వీడియో!
సాధారంగా క్రికెట్ ఆడేటప్పుడు బ్యాటర్ క్రీజులోపల నిలబడి బ్యాటింగ్ చేస్తాడు. అప్పుడప్పుడూ మూడు, నాలుగు అడుగులు మాత్రమే ముందుకొచ్చి బ్యాటింగ్ చేస్తుంటారు. కానీ, ఈ వీడియోలో మాత్రం ఒక బ్యాటర్ క్రీజు దాటి ఏకంగా పిచ్ మధ్యలోకి వెళ్లిపోయాడు. బౌలర్ బంతి వేసేలోపు పిచ్ మధ్యలోకి చేరుకున్నాడు.

Viral Video: క్రికెట్‌ను జెంటిల్మన్ గేమ్ అంటారు. ఆటగాళ్లు స్టేడియంలో ప్రవర్తించే విధానమైనా.. రూల్స్ ఫాలో అవ్వడంలోనైనా క్రికెట్‌కు మరో గేమ్ సాటి రాదు. ఈ గేమ్‌లో అంతగా రూల్స్ ఫాలో అవుతుంటారు. అయితే, అప్పుడప్పుడూ కొందరు వాటిని బ్రేక్ చేస్తుంటారు. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో అలాంటిదే.
Bhadradri: భద్రాద్రిలో రాములోరి కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి.. సీఎం కేసీఆర్ హాజరుపై సందిగ్ధత
సాధారంగా క్రికెట్ ఆడేటప్పుడు బ్యాటర్ క్రీజులోపల నిలబడి బ్యాటింగ్ చేస్తాడు. అప్పుడప్పుడూ మూడు, నాలుగు అడుగులు మాత్రమే ముందుకొచ్చి బ్యాటింగ్ చేస్తుంటారు. కానీ, ఈ వీడియోలో మాత్రం ఒక బ్యాటర్ క్రీజు దాటి ఏకంగా పిచ్ మధ్యలోకి వెళ్లిపోయాడు. బౌలర్ బంతి వేసేలోపు పిచ్ మధ్యలోకి చేరుకున్నాడు. బౌలర్ బంతి వేయగానే బ్యాట్‌తో గట్టిగా బంతిని కొట్టాడు. పిచ్ మధ్యలోకి పరుగెత్తుకుంటూ వెళ్లి బ్యాటింగ్ చేసిన విధానం నెటిజన్లకు నవ్వులు తెప్పిస్తోంది.
అయితే, ఇది జరిగింది ప్రొఫెషనల్ క్రికెట్‌లో కాదు. గల్లీ క్రికెట్‌లో. ఈ ఆట ఎక్కడ ఆడారో తెలియనప్పటికీ, దీనికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కావాలంటే ఈ వీడియో మీరూ చూసి నవ్వుకోండి.
— Out Of Context Cricket (@GemsOfCricket) March 29, 2023