Viral Video: రాత్రికి రాత్రి సోషల్ మీడియా స్టార్ గా మారిన కేరళ బాలుడు.. ఎలా అంటే?
రాత్రికి రాత్రి సోషల్ మీడియా స్టార్ గా మారాడు ఓ కేరళ బాలుడు. ఆరో తరగతి చదువుతున్న ఆ విద్యార్థి తాజాగా ఫుట్ బాల్ మ్యాచ్ ఆడుతూ అద్భుతంగా బ్యాక్-హీల్డ్ గోల్ వేయడమే అందుకు కారణం. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ బాలుడి ప్రతిభను దేశం మెచ్చుకోకుండా ఉండలేకపోతోంది.

Viral Video: రాత్రికి రాత్రి సోషల్ మీడియా స్టార్ గా మారాడు ఓ కేరళ బాలుడు. ఆరో తరగతి చదువుతున్న ఆ విద్యార్థి తాజాగా ఫుట్ బాల్ మ్యాచ్ ఆడుతూ అద్భుతంగా బ్యాక్-హీల్డ్ గోల్ వేయడమే అందుకు కారణం. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ బాలుడి ప్రతిభను దేశం మెచ్చుకోకుండా ఉండలేకపోతోంది.
పండిక్కడ్ లోని చెంబ్రాస్సేరీలో అండర్-12 ఫుట్ బాల్ టోర్నమెంట్ జరిగింది. ఆరో తరగతి బాలుడు గోల్ చేస్తున్న సమయంలో అతడి కోచ్ ఇమ్దాద్ కొట్టపరంబం వీడియో తీశారు. దీన్ని ఆయన సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. బాల్ వస్తున్న సమయంలో గోల్ కీపర్ కనీసం దాన్ని చూడలేకపోయాడని తెలిపారు. అంత అద్భుతం బాలుడు బ్యాక్-హీల్డ్ గోల్ వేశాడని చెప్పారు.
ఈ వీడియో పోస్ట్ చేసిన వెంటనే బాగా వైరల్ కావడంతో దీనిపై కేరళ మంత్రులు వీ శివకుట్టి, అహ్మద్ డేవర్కోవ్ కూడా దీన్ని షేర్ చేయడం గమనార్హం. ఆ గోల్ వేసిన బాలుడు భవిష్యత్తులో భారత ఫుట్ బాల్ స్టార్ అవుతాడంటూ నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. భారత్ లో టాలెంట్ కు కొదవ లేదని దాన్ని బయటకు తీయాలని కొందరు కామెంట్లు చేశారు.
View this post on Instagram
Free Flight Tickets : హాంకాంగ్ కీలక నిర్ణయం.. 5 లక్షల ఉచిత విమాన టికెట్లు