Viral Video: మరో అర సెకండ్ ఆలస్యమైతే ట్రక్కు ఢీ కొట్టేది.. వెంట్రుకవాసిలో తప్పించుకున్న యువకుడు

రహదారిపై ఓ భారీ ట్రక్కు వేగంగా వెళ్తుంది. రోడ్డుపై యూటర్న్ తీసుకునే చోటి నుంచి, ట్రక్కుకు కుడివైపు నుంచి ఓ బైకుపై యువకుడు వేగంగా వచ్చి, రోడ్డు దాటబోయాడు. దీంతో బైకు, ట్రక్కు ఢీ కొట్టుకోబోయాయి. ట్రక్కు డ్రైవర్ వెంటనే ఎడమవైపునకు ఆ వాహనాన్ని మళ్లించి డివైడర్ ను ఢీ కొట్టి ముందుకు వెళ్లాడు. ఆ సమయంలో ట్రక్కు, బైకు మధ్య కేవలం కొన్ని సెంటీమీటర్ల దూరం మాత్రమే ఉంది.

Viral Video: మరో అర సెకండ్ ఆలస్యమైతే ట్రక్కు ఢీ కొట్టేది.. వెంట్రుకవాసిలో తప్పించుకున్న యువకుడు

Viral Video

Viral Video: మరో అర సెకండ్ ఆలస్యమైతే భారీ ట్రక్కు ఢీ కొట్టేది.. ఆ యువకుడి ప్రాణాలు పోయేవి. వెంట్రుకవాసిలో ఘోర ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు ఆ యువకుడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంశు కాబ్రా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇది సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.

రహదారిపై ఓ భారీ ట్రక్కు వేగంగా వెళ్తుంది. రోడ్డుపై యూటర్న్ తీసుకునే చోటి నుంచి, ట్రక్కుకు కుడివైపు నుంచి ఓ బైకుపై యువకుడు వేగంగా వచ్చి, రోడ్డు దాటబోయాడు. దీంతో బైకు, ట్రక్కు ఢీ కొట్టుకోబోయాయి. ట్రక్కు డ్రైవర్ వెంటనే ఎడమవైపునకు ఆ వాహనాన్ని మళ్లించి డివైడర్ ను ఢీ కొట్టి ముందుకు వెళ్లాడు. ఆ సమయంలో ట్రక్కు, బైకు మధ్య కేవలం కొన్ని సెంటీమీటర్ల దూరం మాత్రమే ఉంది.

త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్న యువకుడు ఆగకుండా వెళ్లిపోయాడు. తనను ఢీ కొట్టబోయిన ట్రక్కులోని డ్రైవర్ ఎలా ఉన్నాడన్న విషయాన్నీ కూడా అతడు చూడకుండా వెళ్లిపోయాడు. ఆ యువకుడు పెను ప్రమాదం నుంచి తప్పించుకుని, చల్లగా జారుకున్నాడని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఆ యువకుడు చాలా అదృష్టవంతుడని చావుకి అంత దగ్గరగా వెళ్లి తప్పించుకోవడం అంటే మాటలు కాదని కొందరు నెటిజన్లు పేర్కొన్నారు. యూటర్న్ తీసుకునే ప్రాంతాల్లో, సిగ్నల్స్ ఉండే చోట చాలా జాగ్రత్తగా వెళ్లాలని పోలీసులు సూచిస్తుంటారు. అయినప్పటికీ, చాలా మంది అజాగ్రత్తగా వెళ్తూ ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. తోటి వారిని ప్రమాదాలకు గురిచేస్తున్నారు.

CBI Raids In Hyderabad : హైదరాబాద్ లో కొనసాగుతున్న సీబీఐ సోదాలు.. పలువురి ఇళ్లలో తనిఖీలు