Shocking Video: స్టంట్ చేయాలనుకున్నాడు.. దారుణంగా కింద పడ్డాడు.. షాకింగ్ వీడియో

ఈ వీడియో ప్రకారం.. ఒక వ్యక్తి పలు ఫ్లోర్లు ఉన్న బిల్డింగ్ మెట్ల పై నుంచి దిగుతున్నాడు. అయితే, మెట్ల మీద నుంచి కింది ఫ్లోర్‌కు దిగకుండా మెట్ల పక్కనుండే రెయిలింగ్‌పై కూర్చుని స్లైడ్ డౌన్ చేద్దామనుకున్నాడు. అంటే రెయిలింగ్‌పై నుంచి కిందికి జారేందుకు ప్రయత్నించాడు.

Shocking Video: స్టంట్ చేయాలనుకున్నాడు.. దారుణంగా కింద పడ్డాడు.. షాకింగ్ వీడియో

Shocking Video: సరదాగా చేయాలనుకున్న స్టంట్లు కూడా ఒక్కోసారి ప్రాణాల మీదకు తెస్తాయి. ఏదైనా స్టంట్ చేసే ముందు ప్రమాదాన్ని గుర్తించకపోతే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు. దీనికి ఉదాహరణే ఈ వీడియో. తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Edgardo Greco: పిజ్జా చెఫ్‌గా పని చేస్తున్న మాఫియా డాన్.. 16 ఏళ్లకు పట్టుబడ్డ నిందితుడు

ఈ వీడియో ప్రకారం.. ఒక వ్యక్తి పలు ఫ్లోర్లు ఉన్న బిల్డింగ్ మెట్ల పై నుంచి దిగుతున్నాడు. అయితే, మెట్ల మీద నుంచి కింది ఫ్లోర్‌కు దిగకుండా మెట్ల పక్కనుండే రెయిలింగ్‌పై కూర్చుని స్లైడ్ డౌన్ చేద్దామనుకున్నాడు. అంటే రెయిలింగ్‌పై నుంచి కిందికి జారేందుకు ప్రయత్నించాడు. కానీ, దానిపై నుంచి అదుపుతప్పి అటువైపు కింద పడిపోయాడు. కింద ఉన్న ఒక ఫ్లోర్ దాటి, మరో ఫ్లోర్ మెట్లపై పడిపోయాడు. చాలా ఎత్తు నుంచి పడటంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి.

Son Ordered Food: తండ్రి ఫోన్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసిన ఆరేళ్ల కొడుకు.. బిల్ చూసి తండ్రి షాక్.. ఇంతకీ బిల్లు ఎంతైందంటే!

అది కూడా ఫ్లోర్‌పై పడ్డాడు కాబట్టి సరిపోయింది. మధ్యలో నుంచి నేరుగా కింది ఫ్లోర్‌కు పడిపోయుంటే ప్రాణాలే పోయుండేవి. అతడు మెట్ల రెయిలింగ్‌పై నుంచి కిందికి జారాలనుకున్నాడు సరే.. కానీ, అంత ఎత్తు నుంచి అదుపుతప్పితే ఏమవుతుందో ఊహించలేకపోయాడు. అలా ఏమాత్రం ఆలోచన లేకుండా చేసిన పని అతడి ప్రాణాల మీదకు తెచ్చింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియో కావాలంటే మీరూ చూడండి.