Mermaids : మూసీ తీరంలో మత్స్య కన్యలు సందడి
రెండు రోజుల క్రితం నగరంలో కురిసిన భారీ వర్షాలకు మూసీ నది ఒడ్డున మత్స్య కన్యలు కనిపించాయంటూ ఒక వీడియో సోషల్ మీడియాలోవైరల్ అవుతోంది.

Mermaids : రెండు రోజుల క్రితం నగరంలో కురిసిన భారీ వర్షాలకు మూసీ నది ఒడ్డున మత్స్య కన్యలు కనిపించాయంటూ ఒక వీడియో సోషల్ మీడియాలోవైరల్ అవుతోంది. ఇది తెలంగాణలోని నల్గోండ జిల్లాకు చెందినదని కొందరూ యూ ట్యుబర్లు, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో పోస్ట్ చేయగా… మరికొందరు ఇది హైదరాబాద్ కు చెందిన వీడియోగా చెప్పారు.
ఈ వీడియోను అనేక మంది షేర్ చేశారు. అసలు ఈ వీడియో హైదరాబాద్కి చెందినది కాదు, నల్గోండ ది కాదు…. ఫుటేజీని వాస్తవానికి JJPD ప్రొడక్షన్స్ అనే యూట్యూబ్ ఛానెల్ రెండు వారాల క్రితం షేర్ చేసిందని ఒకరు తెలిపారు.
ఇది వినోద ప్రయోజనాల కోసం వారు సృష్టించిన పారానార్మల్ వీడియో అని మరియు చూపిన చిత్రాలన్నీ కల్పితమని పేర్కొంది. మొత్తానికి ఈ వీడియోకి సోషల్ మీడియాలో పలు కామెంట్లు లభిస్తున్నాయి.
A video claiming scary mermaids were found on the banks of Musi River in #Hyderabad post the rains this week.
Gems of WhatsApp University. pic.twitter.com/HyV7VFfZ8D
— Krishnamurthy (@krishna0302) July 30, 2022