Haryana: కారులోంచి నోట్లు విసిరేసిన యజమానులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

తరచూ ఎవరో ఒకరు ఇలా నోట్ల కట్టలు విసిరేస్తున్నారు. కొందరు క్రేజ్ కోసమే ఇలా చేస్తున్నారు. దీంతో నోట్ల కోసం ప్రజలు రోడ్లపైకి రావడం వల్ల ఇతరులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. అందుకే ఇలా నోట్ల కట్టలు విసిరేసే వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

Haryana: కారులోంచి నోట్లు విసిరేసిన యజమానులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

Haryana: కార్లలోంచి నోట్ల కట్టలు విసిరేయడం ఇటీవల కొందరికి అలవాటుగా మారింది. తరచూ ఎవరో ఒకరు ఇలా నోట్ల కట్టలు విసిరేస్తున్నారు. కొందరు క్రేజ్ కోసమే ఇలా చేస్తున్నారు. దీంతో నోట్ల కోసం ప్రజలు రోడ్లపైకి రావడం వల్ల ఇతరులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది.

Rains In Telangana: తెలంగాణలో మోస్తరు వర్షాలు.. మూడు రోజుల వాతావరణం ఎలా ఉంటుందంటే..

అందుకే ఇలా నోట్ల కట్టలు విసిరేసే వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా గురుగ్రామ్‌లోని, గోల్ఫ్ కోర్స్ రోడ్డులో కారులోంచి నోట్లు విసిరేసిన వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. హరియాణాలోని గురుగ్రామ్‌లో ఒక ఖరీదైన కారులోంచి కొందరు వ్యక్తులు రోడ్డు మీదకి నోట్లు విసిరేశారు. కారు డిక్కీ ఓపెన్ చేసి, నోట్లు విసిరేస్తూ వెళ్లిపోయారు. ఈ ఘటనను కొందరు తమ మొబైల్‌లో వీడియో తీశారు. చివరకు ఈ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై పోలీసులు స్పందించారు.

వీడియో ఆధారంగా నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు గురుగ్రామ్ ఏసీపీ వికాస్ కౌషిక్ తెలిపారు. నిందితుల్ని అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. కారు నెంబర్ ఆధారంగా ప్రధాన నిందితుడిని గుర్తించినట్లు తెలిపారు. ఎవరైనా ఇలా రోడ్లపై నోట్లు విసిరేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.