Viral Video: చిరుతను ఎదిరించిన ముళ్ల పందులు.. ఎందుకంటే?

పిల్లలను కాపాడుకోవడానికి తల్లిదండ్రులు ఎంతటి సాహసం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. జంతువులు కూడా తమ పిల్లలకు రక్షణగా ఉంటూ అనునిత్యం కాపాడుకుంటాయి. తాజాగా ఓ ముళ్లపందిని కాపాడడానికి రెండు ముళ్లపందులు చిరుతను ఎదిరించిన తీరు అందరినీ ఆశ్చర్యపర్చుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Viral Video: చిరుతను ఎదిరించిన ముళ్ల పందులు.. ఎందుకంటే?

Viral Video

Viral Video: పిల్లలను కాపాడుకోవడానికి తల్లిదండ్రులు ఎంతటి సాహసం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. జంతువులు కూడా తమ పిల్లలకు రక్షణగా ఉంటూ అనునిత్యం కాపాడుకుంటాయి. తాజాగా ఓ చిన్న ముళ్లపందిని కాపాడడానికి రెండు ముళ్లపందులు చిరుతను ఎదిరించిన తీరు అందరినీ ఆశ్చర్యపర్చుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఈ వీడియోను ఐఏఎస్ అధికారి సుప్రియా సాధు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను పోస్ట్ చేసిన కొన్ని గంట్లలోనే వేలాది వ్యూస్ వచ్చాయి. ఆ ముళ్ల పందులు తమ బేబీని కాపాడుకోవడానికి జెడ్ కేటగిరీ తరహా రక్షణ కల్పించాయని నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. చిరుత ఏ వైపు నుంచి వచ్చి దాడి చేయాలని భావించినా ఆ వైపునకు పెద్ద ముళ్లపందులు వెళ్లి దాన్ని అడ్డుకున్నాయి.

చిరుతతో అవి పోరాడిన తీరు విస్మయం కలిగిస్తోంది. ముళ్లపందులు ముళ్లతో మృగాలపై దాడిచేసి తమ పిల్లలను కాపాడుకుంటాయి. ఇక్కడ కూడా అదే జరిగింది. పిల్లలను కాపాడుకునేందుకు తల్లిదండ్రులు ఎంతటి ప్రళయాన్నైనా ఎదిరిస్తారని ఈ వీడియోపై ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. తల్లిదండ్రుల ప్రేమ ఇలా ఉంటుందని కొందరు పేర్కొన్నారు.

SAI Recruitment : స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ