Albino Cobra : వామ్మో.. ఓ ఇంట్లో అరుదైన భారీ శ్వేత నాగు ప్రత్యక్షం.. వీడియో వైరల్

Albino Cobra: అడవుల్లో సహజ ఆవాసాలు తగ్గిపోతుండటంతో నాగుపాములు ఇలా అడవుల్లో నుంచి గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయిని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో అరుదైన శ్వేత నాగు గత పదేళ్లలో మూడుసార్లు కనిపించిందన్నారు.

Albino Cobra : వామ్మో.. ఓ ఇంట్లో అరుదైన భారీ శ్వేత నాగు ప్రత్యక్షం.. వీడియో వైరల్

Albino Cobra(Photo : Google)

Albino Cobra : శ్వేత నాగు.. పాము జాతుల్లో ఇదో రకం. ఇంగ్లీష్ లో అల్బినో కోబ్రా అంటారు. శ్వేత నాగు పేరు చాలా మంది వినే ఉంటారు. కానీ, ప్రత్యక్షంగా చాలా మంది చూసి ఉండరు. ఇదో అరుదైన రకం పాము. మామూలు పాములకన్నా భిన్నంగా ఉంటుంది. దాని చర్మం తెల్లగా మిలమిల మెరిసిపోతూ ఉంటుంది. అలాంటి భారీ శ్వేత నాగు ఒకటి ఓ ఇంట్లో ప్రత్యక్షమైంది. దాంతో ఒక్కసారిగా కలకలం రేగింది.

తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఓ భారీ శ్వేత నాగు జనావాసాల మధ్య కనిపించింది. పొడనూర్ పంచాయతీలో నివాసం ఉండే అనంతన్ అనే వ్యక్తి ఇంట్లో ఈ పాము కనిపించింది. భారీ సైజులో ఉన్న తెల్ల పాముని చూసి అంతా హడలిపోయారు. భయంతో వణికిపోయారు. వెంటనే స్నేక్ క్యాచర్ కి సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పాములు పట్టే వ్యక్తి చాక్యచక్యంగా ఆ శ్వేత నాగుని బ్యాగులో బంధించాడు. ఆ తర్వాత ఎంతో జాగ్రత్తగా అనైకట్టి రిజర్వ్ ఫారెస్ట్ లో ఆ పాముని వదిలేశారు. ఆ పాము 5 అడుగుల పొడవు ఉంది.

Also Read..Road Accident : షాకింగ్ వీడియో.. ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం, రోడ్డుపై కారు బీభత్సం

ఈ రకం పాములు చాలా అరుదైనవిగా అధికారులు వెల్లడించారు. అడవుల్లో సహజ ఆవాసాలు తగ్గిపోతుండటంతో నాగుపాములు ఇలా అడవుల్లో నుంచి గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయిని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో ఈ అరుదైన శ్వేత నాగు పొడనూర్ ప్రాంతంలో గత పదేళ్లలో మూడుసార్లు కనిపించిందన్నారు.

శ్వేత నాగులు చాలా అరుదైనవి. ప్రత్యేకమైనవి. ఎందుకంటే వాటికి మెలనిన్ పిగ్మెంటేషన్ ఉండదు. అందుకే ఆ పాము చర్మం తెల్లగా మారుతుందని అటవీశాఖ అధికారులు వివరించారు.

Also Read..Ghaziabad Manhole : షాకింగ్ వీడియో.. అంతా చూస్తుండగానే, నడుస్తూ నడుస్తూ మ్యాన్ హోల్‌లో ఎలా పడిపోయారో చూడండి