Viral Video: ప్రేక్షకులకు షాకిస్తున్న సీరియల్స్.. ఈ సీన్ చూస్తే హడలే… ఏకంగా తాడుతో చంద్రుడ్నే కిందకు లాగారు..!

కొంతకాలంగా అలాంటి కొన్ని సీన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయి, నవ్వులపాలైన సంగతి తెలిసిందే. తాజాగా మరో సీరియల్‌లోని ఒక సన్నివేశం కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ సీన్ చూసి ప్రేక్షకులు షాకవుతున్నారు. ఒక పాత సీరియల్‌లోని సన్నివేశం ఇది.

Viral Video: ప్రేక్షకులకు షాకిస్తున్న సీరియల్స్.. ఈ సీన్ చూస్తే హడలే… ఏకంగా తాడుతో చంద్రుడ్నే కిందకు లాగారు..!

Viral Video: ఇటీవలి కాలంలో వస్తున్న కొన్ని టీవీ సీరియల్స్ ప్రేక్షకులకు షాకిస్తున్నాయి. ప్రేక్షకుల్ని తక్కువగా అంచనా వేస్తున్నారో లేక ఏం తీసినా చూస్తార్లే అనే నమ్మకమో కానీ.. ఏ మాత్రం లాజిక్ లేని చీప్ సీన్స్ క్రియేట్ చేస్తున్నారు. కొంతకాలంగా అలాంటి కొన్ని సీన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయి, నవ్వులపాలైన సంగతి తెలిసిందే.

Rains In Telangana: శని, ఆదివారాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

తాజాగా మరో సీరియల్‌లోని ఒక సన్నివేశం కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ సీన్ చూసి ప్రేక్షకులు షాకవుతున్నారు. ఒక పాత సీరియల్‌లోని సన్నివేశం ఇది. ఈ హిందీ సీరియల్ పేరు ‘యే జాదు హై జిన్ కా’. స్టార్ ప్లస్ ఛానెల్‌లో ప్రసారమైంది. ఈ సీరియల్‌లో హీరోయిన్‌కు చంద్రుడు అంటే ఇష్టం. ఎవరైనా తనను పెళ్లి చేసుకోవాలి అంటే చంద్రుడ్ని కిందకు దించాలి అని చెబుతుంది. దీంతో ఒక యువకుడు ఆ యువతిని దక్కించుకునేందుకు ఏకంగా చంద్రుడినే కిందకు దించుతాడు. ఒక మెరిసే తాడు వేసి చంద్రుడిని కిందకు లాగుతాడు.

పైగా ఆ చంద్రుడిని కిందికి దించేందుకు పక్కనున్న వాళ్లు కూడా సాయం చేస్తారు. గట్టిగా పట్టుకుని లాగుతారు. ఇప్పుడీ సన్నివేశానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ సీన్ చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. కావాలంటే ఈ వీడియో మీరూ చూడండి.