Bike Accident : కేరళలో సినిమా సీన్‌ను తలపించే బైక్ యాక్సిడెంట్

కేరళలోని ఇడుక్కి జిల్లా కట్టప్పన్న వద్ద శుక్రవారం  జరిగిన ఒక బైక్ యాక్సిడెంట్‌ను చూసి స్ధానికులు అవాక్కయ్యారు. సినిమాల్లో చూపించినట్లుగా బైక్ గాల్లోకి  లేచి పక్కనే ఉన్న కరెంట్ ట్రాన్సఫార్మర్ చుట్టూ ఉన్న కంచెలో పడిపోయింది. 

Bike Accident : కేరళలో సినిమా సీన్‌ను తలపించే బైక్ యాక్సిడెంట్

Kerala Bike Accident

Bike Accident :  కేరళలోని ఇడుక్కి జిల్లా కట్టప్పన వద్ద శుక్రవారం  జరిగిన ఒక బైక్ యాక్సిడెంట్‌ను చూసి స్ధానికులు అవాక్కయ్యారు. సినిమాల్లో చూపించినట్లుగా బైక్ గాల్లోకి  లేచి పక్కనే ఉన్న కరెంట్ ట్రాన్సఫార్మర్ చుట్టూ ఉన్న కంచెలో పడిపోయింది.  అదృష్టవశాత్తు ఎటువంటి ప్రమాదం జరగకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

కట్టప్పన కు చెందిన  వెల్లయంకుడి వద్ద వేగంగా బైక్ పై  వస్తున్న యువకుడు   బైక్ పై పట్టుకోల్పోయాడు. దీంతో అక్కడ రోడ్డుపై జారి పడ్డాడు.  బైక్  వేగానికి ఎదురుగా ఉన్న కరెంట్ ట్రాన్సఫార్మర్ చుట్టూ ఉన్న కంచెను ఢీకొట్టగా… ఆ యువకుడు రోడ్డు మీద కొంత దూరం దొర్లుకుంటూ వెళ్ళాడు. యువకుడు నడిపిన అతి వేగానికి, ట్రాన్స్ ఫార్మర్‌ని ఢీకొట్టిన బైక్ గాల్లోకి లేచి కంచె లోపల పడిపోయింది.

రోడ్డు మీద పడిపోయిన యువకుడు  తన స్నేహితుల బైక్ పై అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సమాచారం తెలుసుకుని విద్యుత్ శాఖ అధికారులు ఆ ఏరియాలో కరెంట్ సరఫరా నిలిపి వేశారు. దీంతో ప్రమాదం తప్పింది. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు  బైక్ ను   బయటకు తీసి బైక్ ను నడిపిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read : R.Krishnaiah : ఆర్.కృష్ణయ్యపై హెచ్చార్సీలో ఫిర్యాదు