Sweet Dabeli : దబేలీ స్వీట్ కొత్త వెర్షన్.. విచిత్రంగా తయారు చేసిన వ్యక్తి వీడియో వైరల్

గుజరాత్ పేరు చెప్పగానే స్వీట్ దబేలీని అందరూ గుర్తు చేసుకుంటారు. చాలామంది ఈ స్వీట్ ను ఇష్టంగా తింటారు. దబేలీకి కూడా ఓ వ్యక్తి కొత్త వెర్షన్ తీసుకువచ్చాడు.

Sweet Dabeli : దబేలీ స్వీట్ కొత్త వెర్షన్.. విచిత్రంగా తయారు చేసిన వ్యక్తి వీడియో వైరల్

People shocking the new version of Dabeli

Sweet Dabeli Recipe Making : ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన స్వీట్స్ (Sweet ), రెసెపీస్ ఫేమస్ ఉంటాయి. ఆ వంటకం పేరు చెప్పగానే ఠక్కున ఆ ప్రాంతం పేరు చెప్పేస్తారు. అలాగే ‘దబేలీ’ (Dabeli) స్వీట్ పేరు చెప్పగానే గుజరాత్ స్పెషల్ అని అందరూ గుర్తు పట్టేస్తారు. అంత ఫేమస్ అయిన ఈ స్వీట్‌కి ఇప్పుడు కొత్త వెర్షన్ వచ్చింది. ఓ వ్యక్తి ఉన్న స్వీట్‌ని చెడగొట్టి నానా రకాలు దానికి యాడ్ చేసి తయారు చేసిన కొత్తరకం స్వీట్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ స్వీట్ జనాలకు కోపం తెప్పిస్తోంది. మామూలుగా దబేలీలో ఆలూ మసాలా (potato), పల్లీలతో పాటు సేవ్ స్టప్ చేస్తారు.

Groom As Photographer : తన పెళ్లికి తానే ఫోటోలు తీసుకున్న వరుడు .. వధువుని డిఫరెంట్ యాంగిల్స్‌లో క్లిక్ చేసి భలే వైరల్ అయ్యారుగా..

ఈ స్వీట్ తయారు చేసిన వ్యక్తి వీడియోలో ఎంతో చక్కగా వివరించాడు. ముందుగా రొట్టెలను (bread) కత్తిరించి ఎల్లో కలర్‌లో ఉన్న లిక్విడ్ లో ముంచాడు. తరువాత ఓ సిల్వర్ రేకుల కంటైనర్ బాక్స్ (silver container) తీసుకున్నాడు. ఆ రొట్టెలపై సాస్ వేశాడు. ఆ తరువాత దానిపై కాజు, బాదం, పిస్తాలు పేర్చాడు. మరలా వాటిపై తీయని చట్నీ (chutney) వేశాడు. ఆ వెంటనే పన్నీర్‌ను (paneer ) తురిమి యాడ్ చేశాడు. ఆ తరువాత మూడు రకాల ఐస్ ఫ్రూట్ (ice fruit) ముక్కలను కట్ చేసి అమర్చాడు. నెక్ట్స్ .. ఇంకేముంది? విచిత్రమైన దబేలీ రెడీ.. చూస్తుంటే వికారం తెప్పించేలా ఉంది.. తింటే ఎలా ఉంటుందో? అని జనం తిట్టిపోస్తున్నారు.

Viral Food Video: వెరైటీ ఫుడ్.. ఐస్ క్రీమ్ రోల్ టేస్ట్ చేస్తారా? వైరల్ అవుతున్న వీడియో

“ఈ వీడియో ప్రతి సెకండ్ షాకింగ్ అనిపిస్తుంది” అనే క్యాప్షన్ యాడ్ చేసి ట్విట్టర్ యూజర్ @chiragbarjatyaa ఈ వీడియోని పోస్ట్ చేసాడు. ఇంకేముంది.. జనం రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. ఏదో ఒకటి చేసి వైరల్ అవ్వాలనే ఆలోచనతో ఈ వీడియో చేశారనే ఆరోపణలు వచ్చాయి. సో ఇదండీ ఈ కొత్త వెర్షన్ దబేలీ.. రుచి బాగానే ఉంటే పర్లేదు.. ఈ పదార్ధాలు అన్నీ మిక్సై ఆనక ఆరోగ్యం పాడైతే కష్టం. వైరల్ అవ్వాలనే కాంక్షతో చేస్తున్నారో?.. నిజంగా ప్రయోగాలు చేస్తున్నారో?.. మనుషుల ప్రాణాల మీదకు తేకుండా ఉంటే చాలు.