Viral Video: మెట్రో ట్రైన్‌ నుంచి ఒక స్టేషన్‌లో దిగి పరిగెత్తి.. మరో స్టేషన్‌లో అదే ట్రైన్ ఎక్కిన యువకుడు

ట్రైనును దిగి, ఆ ట్రైను తదుపరి స్టేషన్ లో ఆగేలోపు రోడ్డు మార్గంలో పరిగెత్తి ఆ యువకుడు మళ్ళీ అదే ట్రైనును ఎక్కాడు. ఆ సమయంలో పరిగెత్తిన యువకుడి వద్ద ఓ కెమెరా, ట్రైనులోని అతడి స్నేహితుల వద్ద ఓ కెమెరా ఉంది. యువకుడు పరుగులు తీసిన తీరు, ట్రైన్ తదుపరి స్టేషన్ కు సబ్ వేలో వెళ్లిన మార్గాన్ని ఈ వీడియోలో చూడొచ్చు.

Viral Video: మెట్రో ట్రైన్‌ నుంచి ఒక స్టేషన్‌లో దిగి పరిగెత్తి.. మరో స్టేషన్‌లో అదే ట్రైన్ ఎక్కిన యువకుడు

Viral Video: మెట్రో ట్రైన్‌ నుంచి ఒక స్టేషన్‌లో దిగి వేగంగా పరిగెత్తి మరో స్టేషన్‌ వెళ్లి మళ్ళీ అదే ట్రైన్ ఎక్కాడు ఓ యువకుడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ యువకుడు పరిగెత్తిన తీరుకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియోను ఓ డిజిటల్ మీడియా చీఫ్ వాలా అఫ్సర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

ప్రయాణిస్తోన్న ట్రైనును దిగి, ఆ ట్రైను తదుపరి స్టేషన్ లో ఆగేలోపు రోడ్డు మార్గంలో పరిగెత్తి ఆ యువకుడు మళ్ళీ అదే ట్రైనును ఎక్కాడని చెప్పారు. ఆ సమయంలో పరిగెత్తిన యువకుడి వద్ద ఓ కెమెరా, ట్రైనులోని అతడి స్నేహితుల వద్ద ఓ కెమెరా ఉంది. యువకుడు పరుగులు తీసిన తీరు, ట్రైన్ తదుపరి స్టేషన్ కు సబ్ వే ద్వారా వెళ్లిన మార్గాన్ని ఈ వీడియోలో చూడొచ్చు.

సబ్ వేలో వెళ్తున్న ట్రైను నుంచి దిగి మరుసటి స్టేషన్ లో దాన్ని అందుకోవాలని ఆ యువకుడు, అతడి స్నేహితులు ముందుగా ప్రణాళిక వేసుకుని ఈ వీడియో తీశారు. ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆ యువకుడు చిరుతలా పరుగులు తీశాడని అంటున్నారు. ఆ ట్రైను సబ్ వేలో మలుపులు తిరుగుతూ వచ్చింది కాబట్టి ఆ యువకుడు షార్ట్ కట్ మార్గంలో వెళ్లి మరుసటి స్టేషన్లో దాన్ని అందుకోగలిగాడని కొందరు కామెంట్లు చేశారు.

Viral Video: తరగతి గదిలో విద్యార్థుల ముందు టీచర్ డ్యాన్స్.. తీవ్ర విమర్శలు