Five Horned Goat : స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కిరీటంతో జన్మించిన మేకపోతు

భూమిమీద అనేక జాతుల జంతువులు ఉంటాయి.. వీటిలో కొన్ని చూడగానే నవ్వు తెప్పిస్తాయి. మరికొన్ని వికారం పుట్టిస్తాయి.. ఇంకొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఇలా ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసే విధంగా ఉన్న ఓ మేక నైజీరియాలోని ఓ మార్కెట్లో కనిపించింది. సాధారణంగా మేకకు రెండు కొమ్ములు ఉంటాయి.. కానీ ఈ మేకకు మాత్రం ఐదు కొన్నులు ఉన్నాయి.

Five Horned Goat : స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కిరీటంతో జన్మించిన మేకపోతు

Five Horned Goat

Five Horned Goat : భూమిమీద అనేక జాతుల జంతువులు ఉంటాయి.. వీటిలో కొన్ని చూడగానే నవ్వు తెప్పిస్తాయి. మరికొన్ని వికారం పుట్టిస్తాయి.. ఇంకొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఇలా ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసే విధంగా ఉన్న ఓ మేకపోతు నైజీరియాలోని ఓ మార్కెట్లో కనిపించింది. సాధారణంగా మేకపోతుకు రెండు కొమ్ములు ఉంటాయి.. కానీ దీనికి మాత్రం ఐదు కొమ్ములు ఉన్నాయి.

బక్రీద్ వేళ నైజీరియాలోనే పెద్దదైన లాగోస్ మార్కెట్ ప్రజలంతా మేకలను, గొర్రెలను కొనేందుకు వచ్చారు. వ్యాపారులు పెద్ద సంఖ్యలో మేకలను తీసుకొచ్చారు. వీటిలో ఓ మేకపోతుకు ఐదు కొమ్ములు ఉన్నాయి. ఈ విషయం మార్కెట్ కి వచ్చిన వారికి తెలియడంతో దానిని చూసేందుకు క్యూ కట్టారు.

ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఆ మేకపోతుకు సంబందించిన వీడియోలు వైరల్ గా మారాయి. ఇక దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. కొందరు దాని కొమ్ములను స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కిరీటంతో పోల్చగా, మరికొందరు యువరానిలో ఉందంటూ కామెంట్స్ చేశారు.

ఇక దీనిపై వైద్యులు స్పందించారు.. జన్యుపరమైన లోపలవల్లనే ఈ విధంగా జన్మిస్తాయని తెలిపారు.. ఆరు కాళ్ళు, రెండు తలలతో గతంలో చాలా మేకలు జన్మించాయని, కానీ అవి కొద్దీ గంటల తర్వాత మృతి చెందాయని.. ఇది మాత్రం పెరిగి పెద్దదైందని వివరించారు. జన్యులోపం అనేది సర్వసాధారణ విషయమని పేర్కొన్నారు.