Viral Video: బైకుపై దూసుకెళ్తూ యువతి, యువకుడి రొమాన్స్.. కేసు నమోదు

ఓ జంట బైకుపై ప్రయాణిస్తూ రొమాన్స్ చేసింది. యువకుడు బైకు నడుపుతుండగా అతడి ముందు కూర్చొని, హత్తుకుంటూ, ముద్దులు ఇచ్చింది యువతి. వారిద్దరు రోడ్డుపై ఎవరినీ పట్టించుకోకుండా రొమాన్స్ చేసిన తీరు వాహనదారులకు విస్మయం కలిగించింది. ఈ ఘటన రాజస్థాన్ లోని అజ్మెర్ లో చోటుచేసుకుంది.

Viral Video: ఓ జంట బైకుపై ప్రయాణిస్తూ రొమాన్స్ చేసింది. యువకుడు బైకు నడుపుతుండగా అతడి ముందు కూర్చొని, హత్తుకుంటూ, ముద్దులు ఇచ్చింది యువతి. వారిద్దరు రోడ్డుపై ఎవరినీ పట్టించుకోకుండా రొమాన్స్ చేసిన తీరు వాహనదారులకు విస్మయం కలిగించింది. ఈ ఘటన రాజస్థాన్ లోని అజ్మెర్ లో చోటుచేసుకుంది.

ఆ యువతీయువకుడి దృశ్యాలను ఓ వాహనదారుడు స్మార్ట్ ఫోన్ లో తీశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ యువతీయువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నారు. వారు ప్రయాణించిన బైకును కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. బైకుపై ప్రయాణిస్తూ యువతీయువకులు రొమాన్స్ చేసుకుంటున్న ఘటనలు తరుచూ చోటుచేసుకుంటున్నాయి.

ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ, తోటి వాహనదారులకు ప్రమాదాన్ని కొని తెచ్చేలా ప్రేమికులు ప్రదర్శిస్తున్న ఇటువంటి తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే ఉత్తర ప్రదేశ్ లోని లఖ్ నవూలో కూడా ప్రేమికులు ఇలాగే రెచ్చిపోయారు. బిజీగా ఉండే రోడ్లపై ప్రేమికులు ఇటువంటి చర్యలకు పాల్పడితే పోలీసులు కేసులు పెడుతున్నప్పటికీ తరుచూ ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటుండడం గమనార్హం.

Transgender couple: తల్లిదండ్రులైన వైరల్ ట్రాన్స్‭జెండర్ జంట.. పండండి బిడ్డకు జన్మనిచ్చిన జహాద్

ట్రెండింగ్ వార్తలు