Viral Video: మూడేళ్ల చిన్నారిని రైలు పట్టాలపైకి తోసేసిన మహిళ.. షాకింగ్ వీడియో

Viral Video: ఓ మూడేళ్ల చిన్నారిని ఒక్కసారిగా రైలు పట్టాలపైకి తోసేసింది ఓ మహిళ. ఈ షాకింగ్ దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాకు చిక్కాయి. అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మల్ట్నోమా కౌంటీ జిల్లా అటార్నీ కార్యాలయం తమ వెబ్ సైట్ లో ఈ వీడియోను పోస్ట్ చేసింది. రైల్వే స్టేషన్ లో ప్లాట్‌ఫాంపై మూడేళ్ల చిన్నారి, ఆమె తల్లి రైలు కోసం వేచిచూస్తున్నారు.
ఆ పాప నిలబడి ఉండగా ఆమెను ఓ గుర్తు తెలియని మహిళ రైలు పట్టాలపైకి వేగంగా తోసేసింది. దీంతో వెంటనే తోటి ప్రయాణికులు రైలు పట్టాలపైకి దూకి ఆ పాపను రక్షించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిని 32 ఏళ్ల బ్రియన్నా లేస్ గా గుర్తించారు.
ఆమెను అరెస్టు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. పాప వెనుక కూర్చున్న ఆమె నిలబడి ఆమెను తోసేసినట్లు సీసీవీటీ ఫుటేజీలో స్పష్టంగా కనపడింది. ఆ పాపకు స్వల్పగాయాలయ్యాయని తెలుస్తోంది. ఆమె నుదిటికి దెబ్బ తగిలింది. పట్టాలపైకి రైలు రాకముందే తోటి ప్రయాణికులు పాపను రైల్వే ట్రాకు నుంచి పైకి తీసుకురావడంతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది.
Graphic:
On Dec. 28 at the Gateway Transit Center in Portland, OR, a person shoved a toddler face first into the train tracks. The suspect was apprehended. Antifa & far-left activists in the city have argued against police patrolling public transport, saying it endangers people. pic.twitter.com/H22zL6Zly5— Andy Ngô ?️? (@MrAndyNgo) December 30, 2022
Ice Flowers On River : నదిలో వికసించిన ‘మంచు పుష్పాలు’.. ప్రకృతి అద్భుతానికి నెటిజన్లు ఫిదా