Viral video: తరగతి గదిలో విద్యార్థులతో కలిసి టీచర్ డ్యాన్స్

విద్యార్థుల ముందు కొందరు టీచర్లు చాలా సీరియస్ గా ఉంటారు. మరి కొందరు టీచర్లు మాత్రం చాలా క్లోజ్ గా ఉంటారు. పిల్లలతో కలిసి ఆటపాటల్లోనూ పాల్గొంటుంటారు. తాజాగా, ఓ టీచర్ విద్యార్థులతో కలిసి ఓ పాటకు డ్యాన్స్ చేసి అలరించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే వేలాది వ్యూస్ వచ్చాయి.

Viral video: తరగతి గదిలో విద్యార్థులతో కలిసి టీచర్ డ్యాన్స్

Viral video

Viral video: విద్యార్థుల ముందు కొందరు టీచర్లు చాలా సీరియస్ గా ఉంటారు. మరి కొందరు టీచర్లు మాత్రం చాలా క్లోజ్ గా ఉంటారు. పిల్లలతో కలిసి ఆటపాటల్లోనూ పాల్గొంటుంటారు. తాజాగా, ఓ టీచర్ విద్యార్థులతో కలిసి ఓ పాటకు డ్యాన్స్ చేసి అలరించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే వేలాది వ్యూస్ వచ్చాయి.

తరగతి గదిలో విద్యార్థులతో కలిసి ఈ టీచర్ ‘‘హో జాయేగీ భల్లే భల్లే’’ పాటకు డ్యాన్స్ చేశారు. ఆమె డ్యాన్స్ చేసిన తీరు నెటిజన్లను అలరిస్తోంది. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇటువంటి టీచర్ ప్రతి పాఠశాలలోనూ ఉండానలి ఓ నెటిజన్ పేర్కొన్నాడు.

చిన్నప్పటి నుంచే బండెడు పుస్తకాలు మోస్తూ ఒత్తిడికి గురవుతున్న పిల్లలు ఇలా డ్యాన్స్ చేసేలా ప్రోత్సహిస్తే వారి ఒత్తిడి తగ్గుతుందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. తరగతి గదిలో అన్ని రకాలుగా విద్యార్థులను టీచర్లు ప్రోత్సహించాలని కొందరు నెటిజన్లు పేర్కొన్నారు. పిల్లల కన్నా టీచర్ బాగా డ్యాన్స్ చేసిందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

 

View this post on Instagram

 

A post shared by ?Anushka Chaudhary? (@chaudharymuskan26)

Nithin : మణికొండలో బాబాయ్ హోటల్‎ను ప్రారంభించిన హీరో నితిన్..