Viral Video : గుర్రంపై ఫుడ్ డెలివరీ చేసిన స్విగ్గీ డెలివరీ బాయ్

ఇటీవల ముంబైలో ఒక స్విగ్గీ ఫుడ్ డెలివరీ బాయ్ వార్తల్లో  కెక్కాడు. భారీ వర్షం పడుతున్నా లెక్క చేయకుండా ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్లాడు.   బైక్ మీద అనుకుంటున్నారా.... కాదు.. గుర్రం మీద. 

Viral Video : గుర్రంపై ఫుడ్ డెలివరీ చేసిన స్విగ్గీ డెలివరీ బాయ్

Swiggy Delivery Boy On Horse

Viral Video :  ఈరోజుల్లో ఆన్ లైన్ లోనే అన్ని వస్తువులు బుక్ చేసుకుని ఇంటి  వద్దకే  డెలివరీ చేయించుకునే సదుపాయాలు వచ్చాయి. వాటిలో ఫుడ్ కూడా ఉంది.  స్విగ్గీ ద్వారా మనకు నచ్చిన ఫుడ్ మన ఇంటికే తెప్పించుకుని తింటున్నాము. ఇందుకోసం ఫుడ్ డెలివరీ బాయ్స్ ఉన్నారు. వీరు బైక్ ల మీద మహానగరాల్లో తమ సేవలు అందిస్తున్నారు. ఆర్డర్ వచ్చిన తర్వాత సరైన టైమ్ లో డెలివరీ చేసిన వారికి సంస్ధ ఇన్‌సెంటివ్స్ ఇస్తూ ప్రోత్సహిస్తోంది కూడా.

ఇటీవల ముంబైలో ఒక స్విగ్గీ ఫుడ్ డెలివరీ బాయ్ వార్తల్లో  కెక్కాడు. భారీ వర్షం పడుతున్నా లెక్క చేయకుండా ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్లాడు.   బైక్ మీద అనుకుంటున్నారా…. కాదు.. గుర్రం మీద.   అందుకే ఇది అందరి దృష్టిని ఆకర్షించింది.వాన  చినుకు పడితే మహా నగరాల్లో ట్రాఫిక్ ఎలా ఉంటుందో ఆ కష్టం అనుభవించిన వారికి తెలుస్తుంది.  నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఇటీవల ముంబైలో భారీగా వర్షాలు కురిసాయి. అందుకు తగ్గట్టే రోడ్లన్నీ వరద నీటితో నిండిపోయాయి. రోడ్లపై భారీగా ట్రాఫిక్ జాం అవుతోంది.

ఇంతలో ఒక స్విగ్గీ బాయ్ కు ఆర్డర్ వచ్చింది. వర్షం కురుస్తోంది కదా అని ఆగిపోలేదు. వెంటనే ఆ పార్సిల్ తీసుకుని గుర్రం ఎక్కి డెలివరీ చేయటానికి బయలు దేరాడు.ఈ దృశ్యాన్ని ఒక వ్యక్తి తన కారులోంచి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతూ స్విగ్గీ బాయ్ చేసిన పని చూసి వావ్ అంటున్నారు. మీరు కూడా ఓ లుక్కేయండి.