Deer Escapes Video: తెలివిగా బారియర్ గేటు దాటుకుని బయటకు జింక

ఓ జింక చాలా తెలివిగా బారియర్ గేటు దాటుకుని బయటకు వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ జింక చాకచక్యంగా వ్యవహరించిన తీరు అలరిస్తోంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి సుశాంత నంద ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

Deer Escapes Video: తెలివిగా బారియర్ గేటు దాటుకుని బయటకు జింక

Deer Escapes Video

Deer Escapes Video: ఓ జింక చాలా తెలివిగా బారియర్ గేటు దాటుకుని బయటకు వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ జింక చాకచక్యంగా వ్యవహరించిన తీరు అలరిస్తోంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి సుశాంత నంద ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

‘‘సమర్థత అనేది కేవలం నైపుణ్యానికి సంబంధించిన అంశమే కాదు.. ఇది వైఖరికి సంబంధించింది కూడా. బతకడానికి, పురోగమించడానికి మన వైఖరి ఉపయోగపడుతుంది. ఈ జింక తన కొమ్ములతో ప్రదర్శించిన యుక్తిని చూడండి’’ అని సుశాంత నంద పేర్కొన్నారు.

తెల్ల తోక ఉన్న ఓ జింక బారియర్ గేటు దాటుకుని బయటకు రావాలనుకుంటుంది. జింకలు బయటకు రాకుండా ఏర్పాటు చేసిన బారియర్ గేటు అది. అయినప్పటికీ, ఆ జింక మొదట తన కుడివైపు కొమ్ములను బారియర్ గేటు కింద నుంచి బయటకు తీసి, అనంతరం ఎడమవైపు కొమ్ములను బయటకు తీస్తుంది. ఆ తర్వాత తన శరీరాన్ని కిందకు వంచి బారియర్ గేటు దాటుతుంది.

Engineer sisters Video: ఒకే అబ్బాయిని పెళ్లి చేసుకున్న అక్కాచెల్లెళ్లు.. ఒకే పూలదండ వేస్తూ…

సుశాంత నంద ఈ వీడియోను పోస్టు చేసిన కొద్ది సేపటికే ఇది బాగా వైరల్ అయింది. అచ్చం మనిషిలా ఆ జింక ఆలోచించినట్లుందని పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు. అటవీశాఖ అధికారులు ఇటువంటి వీడియోలను పోస్టు చేయడం కొత్తేమీ కాదు. గతంలోనూ చాలా సార్లు ఇటువంటి వీడియోలను పోస్ట్ చేశారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..