Viral Video: బరాత్ ఊరేగింపు.. పెళ్లి కుమారుడితో ఉడాయించిన గుర్రం!

పెళ్లిలో బరాత్ ఎంత ఉత్సాహంగా ఉంటుందో.. బరాత్ లో గుర్రంపై ఊరేగింపు ఉంటే అంతకు మించిన మజా వస్తుందంటునుకుంటారు పెళ్లి పెద్దలు. అందుకే పెళ్లిలో వరుడిని గుర్రం మీద ఊరేగించడం కొంతమందికి ఆనవాయితీగా వస్తుంది. అయితే, మజా సంగతేమో కానీ ఒక్కోసారి ఆ గుర్రాలు చుక్కలు చూపిస్తుంటాయి.

Viral Video: బరాత్ ఊరేగింపు.. పెళ్లి కుమారుడితో ఉడాయించిన గుర్రం!

Viral Video

Viral Video: పెళ్లిలో బరాత్ ఎంత ఉత్సాహంగా ఉంటుందో.. బరాత్ లో గుర్రంపై ఊరేగింపు ఉంటే అంతకు మించిన మజా వస్తుందంటునుకుంటారు పెళ్లి పెద్దలు. అందుకే పెళ్లిలో వరుడిని గుర్రం మీద ఊరేగించడం కొంతమందికి ఆనవాయితీగా వస్తుంది. అయితే, మజా సంగతేమో కానీ ఒక్కోసారి ఆ గుర్రాలు చుక్కలు చూపిస్తుంటాయి. తేడా వస్తే అవి వరుడిని కింద పడేసి మరీ పరుగు లంకించుకుంటాయి. అయితే రాజస్థాన్‌లోని ఈ గుర్రం మాత్రం వరుడితో సహా ఉడాయించింది.

రాజస్థాన్‌లోని అజ్మీర్‌ జిల్లా రాంపుర గ్రామంలో జరిగింది. ఈ గ్రామానికి చెందిన ఓ యువకుడి వివాహం నిశ్చయమైంది. పెళ్లి నసీరాబాద్‌లో ఉండడంతో గ్రామం నుంచి ఊరేగింపుగా బంధుమిత్రులతో వరుడు అశ్వంపై బయల్దేరాడు. ఈ సందర్భంగా బంధువులు డ్యాన్స్‌లు చేస్తూ సంబరంగా వెళ్తూ మధ్యలో బాణసంచా కాల్చారు. పటాకుల చప్పుడుకు గుర్రం అదిరింది. వరుడితో పాటు గుర్రం పరుగులు పెట్టింది.

అలా నాలుగు కిలోమీటర్ల దాక వరుడిని కూడా లాకెళ్లింది. ఇంత జరిగినా కూడా ఆ వరుడికి గాయాలేమీ కాకపోవడంతో బంధువులు, వధువు తరఫు వారు ఊపిరి పీల్చుకున్నారు. మొత్తానికి ఆ గుర్రం హడావుడి నుండి బయటపడి చివరకు మండపానికి వెళ్లి పెళ్లి చేసుకున్నాడు. ఈ సంఘటన ఇటీవల జరుగగా దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మీ సంతోషం కోసం మూగజీవాలను హింసిస్తే ఇలానే ఉంటుందని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తుంటే.. పెళ్లి కొడుకు నిజంగా లక్కీ అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.