Viral News: పట్టాలపై పడిన వికలాంగుడు.. హీరోలా వచ్చి కాపాడాడు!

ఆ మధ్య మన దేశంలో ఓ మహిళ, చిన్నారి రైల్వేస్టేషన్ లో ఫ్లాట్ ఫామ్ మీద నడుచుకుంటూ వెళ్తుండగా.. చిన్నారి ట్రాక్ మీద పడిపోతే పోలీస్ క్షణాల్లో ట్రాక్ మీదకి దూకి చిన్నారిని కాపాడిన సంగతి తెలిసిందే. అచ్చంగా అమెరికాలో అలాంటి ఘటనే జరగగా ఇప్పుడు అది ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది.

Viral News: పట్టాలపై పడిన వికలాంగుడు.. హీరోలా వచ్చి కాపాడాడు!

Viral News

Viral News: ఆ మధ్య మన దేశంలో ఓ మహిళ, చిన్నారి రైల్వేస్టేషన్ లో ఫ్లాట్ ఫామ్ మీద నడుచుకుంటూ వెళ్తుండగా.. చిన్నారి ట్రాక్ మీద పడిపోతే పోలీస్ క్షణాల్లో ట్రాక్ మీదకి దూకి చిన్నారిని కాపాడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో అతన్ని హీరోలా కీర్తించి నజరానాలు కూడా ఇచ్చారు. అచ్చంగా అమెరికాలో అలాంటి ఘటనే జరగగా ఇప్పుడు అది ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది.

న్యూయార్క్ లోని యూనియన్ స్క్వేర్ రైల్వే స్టేషన్లో ఓ వికలాంగుడు ఫ్లాట్ ఫామ్ మీదగా వెళ్తుండగా ప్రమాదవశాత్తు వీల్ చైర్ తో సహా ట్రాక్ మీద పడిపోయాడు. ఫ్లాట్ ఫామ్ మీద చాలామంది ప్రయాణికులు ఉండగా అందులో ఒక వ్యక్తి ట్రాక్ మీదకి దిగి ముందుగా వీల్ చైర్ ను పైకి ఎక్కించి వికలాంగుడిని కూడా పైకి ఎక్కించాడు. అతను ట్రాక్ మీదకి దిగిన అనంతరం మిగతా ప్రయాణికులు కూడా ముందుకొచ్చి అతనికి సాయం అందించారు.

ఫ్లాట్ ఫామ్ మీద ఉన్న వాళ్ళు సురక్షితంగా పైకి వచ్చిన పది సెకన్లకు రైలు ట్రాక్ మీదకి వచ్చింది. రైలు వస్తుందని ఒకపక్క అనౌన్స్ మెంట్ వినిపిస్తుండడంతో ఎవరూ ట్రాక్ మీదకి దిగేందుకు సాహసించలేదు. కానీ ఓ వ్యక్తి ట్రాక్ మీదకి దిగడంతో మిగతా వాళ్ళు కూడా ముందుకొచ్చి సాయం చేశారు. అయితే..ముందుగా ట్రాక్ మీదకి దిగిన అతని ధైర్యానికి నెటిజన్లు ఫిదా అవుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు.