పట్టుదలే పసిడి పతకాలు తెచ్చింది : కాళ్లకు టేపుని షూలా వేసుకుని పరిగెత్తింది

  • Published By: veegamteam ,Published On : December 16, 2019 / 05:37 AM IST
పట్టుదలే పసిడి పతకాలు తెచ్చింది :  కాళ్లకు టేపుని షూలా వేసుకుని పరిగెత్తింది

అథ్లెటిక్స్‌ క్రీడా పోటీలు అంటే చిన్న విషయం కాదు.. దానికి ఏంతో కష్టపడాలి. అందులో పతకాలు సాధించాలంటే ఏంతో పట్టుదల ఉండాలి. అయితే ఈ పోటీల్లో ఫిలిప్పైన్స్లోని బలాసన్‌కు చెందిన రియా బుల్లోస్ అనే 11ఏళ్ల బాలిక పట్టుదల చూస్తే.. ఎవ్వరైనా ఫిదా కావాలిసిందే.  

తాజాగా  ఫిలిప్పైన్స్‌లో ఇంటర్ స్కూల్ రన్నింగ్ పోటీలు జరిగాయి. రియా బుల్లోస్ ఆ పోటీల్లో పాల్గొనేందుకు పేరు ఇచ్చింది. కానీ ఆ పోటీల్లో పాల్గొనాలంటే కచ్చితంగా షూ ఉండాల్సిందే. తనకు షూ కొనే స్తోమత కూడా లేకపోవడంతో. తను కాళ్లకు టేపులు చుట్టుకుని పోటీల్లో పాల్గొంది. అంతేకాదు వాటి మీద బ్రాండెడ్ సంస్థ ‘NIKE’ పేరు రాసుకుంది. టేపులు ధరించిన కాళ్లతోనే ఆ చిన్నారి 400 మీటర్లు, 800 మీటర్లు, 1500 మీటర్ల పోటీల్లో మొదటి స్థానంలో నిలిచి మూడు బంగారు పతకాలను సాధించింది.

దీంతో ఆమె కోచ్ ప్రిదిరిక్ ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజనులు ఆమె పట్టుదలకు ఫిదా అవుతున్నారు. అంతేకాదు నెటిజన్లు ఆ బాలికకు బూట్లు కొనించేందుకు అవసరమైన ఆర్థిక సాయం అందిస్తామంటు ముందుకొచ్చారు.

ఇక ఈ విషయం తెలుసుకున్న బాస్కెట్ బాల్ స్టోర్ ‘టైటాన్ 22’ CEO జెఫ్ కరియసో ఆమెతో మాట్లాడే అవకాశం కల్పించాలని కోరారు. అనంతరం ఆమెతో మాట్లాడిన ఆయన.. నీకు SM స్టోరులో అవసరమైన స్పోర్ట్స్ షూలు, సాక్స్, స్పోర్ట్స్ బ్యాగ్ తీసుకోమని తెలిపారు. మొత్తానికి ఆమె ఫొటో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల తనకు మంచి జరిగింది.