ఇది విన్నారా?: మూడు ఏళ్ల పాపకు ఓటుహక్కు..!!

  • Published By: veegamteam ,Published On : January 4, 2020 / 05:33 AM IST
ఇది విన్నారా?:  మూడు ఏళ్ల పాపకు ఓటుహక్కు..!!

మూడు సంవత్సరాల చిన్నారికి ఓటు హక్కు ఉందనే సంగతి మీకు తెలుసా? ఇదేదో జోక్ గా చె్పేది కాదు. స్వయంగా ప్రభుత్వం అధికారులే ఎల్‌కేజీ చదువుతున్న మూడు ఏళ్ల పాపకు ఓటు హక్కు ఉన్నట్లుగా పేర్కొన్నారు. మరి ఇదెలా సాధ్యమో తెలుసుకుందాం..

తెలంగాణలో త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా అధికారులు విడుదల చేసిన ఓటరు ముసాయిదాలు తప్పుల తడకలుగా ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అర్హతున్న వారికి ఓటుహక్కు లేదన్నట్లుగా..లేని వారికి ఉన్నట్లుగా ఓటర్ల ముసాయిదా తయారు చేశారు. 

కరీంనగర్‌ నగరపాలకసంస్థ పరిధిలోని ఓ మూడేళ్ల చిన్నారిని ఓటరు ముసాయిదాలో చేర్చారు. కరీంనగర్‌లో ఓటర్‌ ఐడీ YOJ 8588352 నంబర్‌పై నందిత మెతుకు పేరిట నమోదైంది. అంతేకాదు..నందిత వయస్సు 35ఏళ్లుగా, ఇంటినంబర్‌ 5–6–434గా ప్రచురించారు. వీటిని చూసిన నందిత తండ్రి మెతుకు రమేశ్‌ షాక్ అయ్యాడు. ఇదేంటి నా కూతురు నందిత వయస్సు 3ఏళ్లు. తనకు ఓటుహక్కు ఉండటమేంటని అవాక్కయ్యాడు. నందిత ఎల్‌కేజీ చదువుతోందని.. అధికారులు స్పందించి వెంటనే ఓటర్‌ లిస్ట్‌ నుంచి తమ కూతురుపేరు తొలగించాలని కోరాడు.