Son Ordered Food: తండ్రి ఫోన్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసిన ఆరేళ్ల కొడుకు.. బిల్ చూసి తండ్రి షాక్.. ఇంతకీ బిల్లు ఎంతైందంటే!

తెలిసీ తెలియక బుడ్డోడు తండ్రి ఫోన్ నుంచి ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేశాడు. అంతే.. ఆ బిల్లు చూసి షాకైన తండ్రి ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. అమెరికాలోని మిచిగాన్‌కు చెందిన కీత్ స్టోన్‌హౌజ్ అనే వ్యక్తి తన ఆరేళ్ల కొడుకు చేజ్‌కు ఇటీవల స్మార్ట్‌ఫోన్ ఇచ్చాడు.

Son Ordered Food: తండ్రి ఫోన్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసిన ఆరేళ్ల కొడుకు.. బిల్ చూసి తండ్రి షాక్.. ఇంతకీ బిల్లు ఎంతైందంటే!

Son Ordered Food: ఆరేళ్ల కొడుకు చేసిన పని తండ్రికి షాక్ ఇచ్చింది. తెలిసీ తెలియక బుడ్డోడు తండ్రి ఫోన్ నుంచి ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేశాడు. అంతే.. ఆ బిల్లు చూసి షాకైన తండ్రి ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. అమెరికాలోని మిచిగాన్‌కు చెందిన కీత్ స్టోన్‌హౌజ్ అనే వ్యక్తి తన ఆరేళ్ల కొడుకు చేజ్‌కు ఇటీవల స్మార్ట్‌ఫోన్ ఇచ్చాడు.

Edgardo Greco: పిజ్జా చెఫ్‌గా పని చేస్తున్న మాఫియా డాన్.. 16 ఏళ్లకు పట్టుబడ్డ నిందితుడు

ఫోన్లో అరగంటసేపు మాత్రమే గేమ్ ఆడుకునేందుకు అనుమతిచ్చాడు. ఫోన్ తన కొడుకు చేతికిచ్చి వెళ్లిపోయాడు. అయితే, ఆరేళ్ల చేజ్ మాత్రం గేమ్స్ ఆడుకోకుండా ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేశాడు. అరగంట తర్వాత కీత్ తన కొడుకు దగ్గరి నుంచి ఫోన్ తీసుకుని పడుకునేందుకు వెళ్లాడు. అయితే, ఫోన్ గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ, అతడికి వరుసగా మెసేజెస్ రావడం మొదలైంది. ‘మీ ఫుడ్ డెలివరీ అయింది’, ‘మీ ఫుడ్ తయారవుతోంది’, ‘మీ ఫుడ్ దారిలో ఉంది’ వంటి మెసేజెస్ వరుసగా వస్తున్నాయి. ఇవన్నీ చూసి కీత్ షాకయ్యాడు. అదే సమయంలో ఫుడ్ డెలివరీ తీసుకొచ్చిన వాళ్ల నుంచి వరుసగా తన ఇంటి కాలింగ్ బెల్ మోగడం మొదలైంది.

PM Modi: తుమకూరులో ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ల తయారీ కేంద్రం.. సోమవారం ప్రారంభించనున్న మోదీ

ఆ బెల్ వరుసగా మోగుతుండటంతో కూడా కీత్ చిరాకుపడ్డాడు. చివరకు తన కొడుకు వెయ్యి డాలర్లు (రూ.80,000) విలువైన ఫుడ్ ఆర్డర్ చేశాడని తెలిసి షాకయ్యాడు. ఇందులో 25 శాతం డెలివరీ ఏజెంట్స్‌కు టిప్‌గా వెళ్లింది. బుడ్డోడు చేసిన పనికి కీత్ షాకయ్యాడు. ఈ విషయాన్ని ఇన్‌స్టా ద్వారా వెల్లడించాడు. ఇంతకీ ఆరేళ్ల చిన్నారి ఏం ఆర్డర్ చేశాడంటే.. జంబో ష్రింప్ 5 ఆర్డర్స్, సలాడ్, చిల్లీ చీజ్ ఫ్రైస్, చికెన్ షవర్మా శాండ్విచెస్, ఐస్ క్రీమ్స్ వంటివి ఆర్డర్ చేశాడు. వీటిలో కొన్ని ఆర్డర్స్ రిపీటెడ్‌గా ఉండటం విశేషం. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించిన వార్త అక్కడి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.