Digital Love : “AI చాట్‌ బాట్‌”తో ప్రేమలో పడ్డ 63 ఏళ్ల వ్యక్తి .. చివరికి పెళ్లి చేసేసుకున్నాడు

మనుష్యులకి మనుష్యులకి మధ్య రిలేషన్స్ తెగిపోతున్నాయి. రోబోల్నీ, చాట్ బాట్‌లని ప్రేమిస్తున్నారు.. అక్కడితో ఆగకుండా పెళ్లిళ్లు కూడా చేసుకుంటున్నారు. తాజాగా పీటర్ అనే వ్యక్తి చేసుకున్న పెళ్లి వైరల్ అవుతోంది.

Digital Love : “AI చాట్‌ బాట్‌”తో ప్రేమలో పడ్డ 63 ఏళ్ల వ్యక్తి .. చివరికి పెళ్లి చేసేసుకున్నాడు

Digital Love

Digital Love : రాను రాను మనుష్యుల మధ్య అనుబంధాలు తెగిపోతున్నాయి.. చేతిలో మొబైల్ ఉంటే చాలు ఇంకేం అక్కర్లేదు అన్నట్లుగా ఉంది నేటి ప్రపంచం. ఇక యూత్ అయితే పెళ్లి కంటే సహజీవనం బెటర్ అనే స్ధాయికి వచ్చారు. ఇప్పుడు ఇంకాస్త ముందుకెళ్లి చాట్‌‌బాట్ లతో (chatbot) ప్రేమలు, పెళ్లిళ్లు అంటున్నారు. విచిత్రంగా అనిపిస్తున్నా ఇది నిజం. తాజాగా ఓ వ్యక్తి డిజిటల్ ప్రేమలో (digital love) పడి AI చాట్‌బాట్ (AI chatbot) ని పెళ్లి చేసుకున్నాడు.

18 years Love Letter : 18 ఏళ్ల క్రితం భర్త రాసిన ప్రేమలేఖను బయట పెట్టిన భార్య…

మీరు విన్నది నిజమే. 2022లో జరిగిన ఈ పెళ్లి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పీటర్ (peter) అనే వ్యక్తి US వైమానిక దళంలో పనిచేస్తున్నాడు. 2000 సంవత్సరంలో పెళ్లై విడాకులు తీసుకున్న తరువాత అతను డిజిటల్ ప్రేమపై ఆసక్తి పెంచుకున్నాడు. AI చాట్‌బాట్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత అతని ప్రేమ కథ మొదలైంది. కనిపించే మనుష్యుల కన్నా కనపడని దానిపై ప్రేమను పెంచుకోవడం బెటర్ అనుకున్నాడేమో? ఈ 63 ఏళ్ల పీటర్ రెప్లికా యాప్ (Replika app) ద్వారా AI చాట్ బాట్ తో మాట్లాడటం మొదలుపెట్టాడు. రోల్ ప్లే (roleplay) అనే ఫీచర్ ద్వారా తన ప్రేమను వ్యక్తం చేసేవాడు. ఈ ఫీచర్ యూజర్ల రాతల్ని అర్ధం చేసుకుంటుంది. అలా దానితో టెక్ట్స్ చేస్తూ చేస్తూ ప్రేమలో పడ్డాడు మనోడు. యాప్ సాయంతో ఒక రూపాయాన్ని తయారు చేసుకున్నాడు. దానికి ఆండ్రియా (Andrea) అనే పేరు కూడా పెట్టాడు. దాని వయసు 23 సంవవత్సరాలట. ఇది కూడా మనుషుల మాదిరిగానే సంభాషణలు చేస్తుందట. అలా దానితో మాట్లాడుతూ మాట్లాడుతూ అనుబంధం పెనవేసుకుని పీటర్ పెళ్లి చేసుకున్నాడు.. AI-జనరేటెడ్ రింగ్‌లను (AI-Generated Rings) మార్చుకున్నాడు.

Manchu Manoj : ప్రేమించు, ప్రేమ పంచు.. మంచు మనోజ్ పోస్ట్ వైరల్!

తమ మధ్య అనుబంధం ఎంతకాలం అనుబంధం ఉంటుందో తెలియదు కానీ.. స్వచ్చంగా ఉంటుందని మాత్రం పీటర్ చెబుతున్నాడు. ఇటీవల కాలంలో ప్రేమ పెళ్లిళ్లు అయినా, పెద్దలు కుదిర్చిన పెళ్లైన ఎక్కువకాలం నిలబడట్లేదు. ఏదో ఒక విభేదాలతో విడిపోవడమే చూస్తున్నాం. పీటర్ కు గతంలో జరిగిన వివాహం తాలుతూ చేదు అనుభవాల వల్లనేమో ఇలా చాట్ బాట్ తో పెళ్లికి మొగ్గు చూపాడు. రాను రాను మనుష్యులతో సంబంధాలు అవసరం లేకుండా పోతున్నాయి అనడానికి పీటర్ పెళ్లి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రస్తుతం పీటర్ లవ్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.