అరవైల్లో అవ్వ ఎనర్జీ మాములుగా లేదుగా.. ఆనంద్ మహేంద్ర ఆశ్చర్యపోయాడు..

10TV Telugu News

ఇరవై ఏళ్లకే ఎక్కడకైనా వెళ్లాలంటే కాళ్లు నొప్పులు వచ్చే పరిస్థితిలో ఉన్నారు ఇప్పటి జనం అటువంటిది అరవైల్లో అసలు నడవడమే కష్టం అనుకునే వయస్సులో ఓ అవ్వ యువతుల కంటే ఎంతో హుషారుగా చిందులు వేస్తూ వంట చేస్తుంది. 

మహీందా గ్రూప్ ఛైర్మన్.. ఆనంద్ మహీంద్రా ఎంతో చురుకుగా సోషల్ మీడియాలో ఉంటారో అందరికి తెలిసిన విషయమే. ఆయన స్పూర్తినిచ్చే వీడియోలు, ఫన్నీ పోస్ట్ లను ట్విటర్ ద్వారా అందరితో పంచుకుంటు ఉంటారు. ఆయనే లేటెస్ట్ గా అరవై ఏళ్ళ వయస్సులో ఓ బామ్మ ఎంతో చలాకీగా డాన్స్ చేసిన వీడియోను తన ట్విటర్ లో షేర్ చేశారు.

ఆనంద్ మహీంద్రాకి న్యూయర్ సందర్భంగా చాలా వీడియోలు, మెసేజ్ లు చాలా వచ్చాయి. ఒక వీడియోలో మాత్రం బామ్మ న్యూయర్ వేడుకల్లో భాగంగా మాంసం వండుతూ.. మళయాలం మెగాస్టార్ మోహన్ లాల్ సినిమాలోని పాపులర్ సాంగ్  జిమికి కమల్ పాటకు డాన్స్ చేస్తూ అదరగోట్టింది.  ఆ వీడియో తనకు చాలా బాగా నచ్చిందంటూ తన ట్విట్టర్ లో చెప్పుకొచ్చారు. 

ఆ వీడియోలో ఉన్న బామ్మ ఎవరో, ఆ వీడియో తీసిన వ్యక్తి ఎవరో తనకు తెలియదు అని అన్నారు. బామ్మ డాన్స్ మాత్రం తనను పండుగ మూడ్ లోకి తీసుకెళ్లిందని, ఇంటికి వెళ్లిన మరుక్షణం బామ్మ చేసిన డాన్స్ సెప్టులను ప్రాక్టీస్ చేస్తా అని ఆనంద్ మహీంద్రా ట్విట్ చేశారు.