Viral Video: తేనెతుట్టెపై దాడి చేసేందుకు బ్రిడ్జి కట్టేసిన చీమలు

ఐకమత్యం గురించి చెప్పాలంటే చీమలను చూసి చెబుతారు. ఎందుకంటే దాడి చేయడానికైనా, చోరీకైనా క్రమ పద్ధతిలో వెళ్తుంటాయి. టార్గెట్ ఫిక్స్ అయ్యాయంటే ఎన్ని తంటాలైనా, తిప్పలైనా పడి అదే వరుసలో గమ్యస్థానానికి కావాలనుకున్నవి తీసుకుపోతుంటాయి.

Viral Video: తేనెతుట్టెపై దాడి చేసేందుకు బ్రిడ్జి కట్టేసిన చీమలు

Ants Bridge

Viral Video: ఐకమత్యం గురించి చెప్పాలంటే చీమలను చూసి చెబుతారు. ఎందుకంటే దాడి చేయడానికైనా, చోరీకైనా క్రమ పద్ధతిలో వెళ్తుంటాయి. టార్గెట్ ఫిక్స్ అయ్యాయంటే ఎన్ని తంటాలైనా, తిప్పలైనా పడి అదే వరుసలో గమ్యస్థానానికి కావాలనుకున్నవి తీసుకుపోతుంటాయి. ఇదిలా ఉంటే తేనెటీగలు కూడా గుంపులుగా పోతూ అంతే రేంజ్ లో ఐకమత్యాన్ని ఫాలో అవుతాయి.

చీమలని చూసి భయపడకపోయినా.. తేనెటీగలకు భయపడని వారుండరు. కానీ, ఎంతో కష్టపడి పోగు చేసిన తేనెటీగల శ్రమ.. తేనెతుట్టెను టార్గెట్ చేశాయి చీమలు. మరి దానిని దోచుకోవాలంటే ఎలా.. రూఫ్‌కు ఉన్న తుట్టె నుంచి పైకి వెళ్లడానికి పాకి ప్రయత్నించి విఫలమయ్యాయో ఏమో.. ఏకంగా బ్రిడ్జ్ కట్టేశాయి.

ఇది కొత్తది కాకపోయినా.. బ్రెజిల్ లోని ఎలక్ట్రికల్ ఇంజినీర్ 2018లో తీసిన వీడియో ఆన్‌లైన్ లో ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. పైగా దానికి ‘చీమలన్నీ కలిసి తేనెతుట్టెను దొంగిలించాలని ప్లాన్ చేశాయి. వాటి తెలివి అమోఘం. బ్రిడ్జి కట్టేసి అక్కడి నుంచి ఇటువైపుకు వస్తున్నాయి’ అంటూ ట్వీట్ కు క్యాప్షన్ పెట్టాడు.

ఇలాంటి అటాక్ జరిగితే.. తేనెతుట్టె ఖాళీ చేసేంత వరకూ.. అవి విడిచిపెట్టవు. కొందరైతే పారిపోతారు కూడా. నది మీద కూడా బ్రిడ్జి కట్టేసేలా ఉన్నాయీ ఈ చీమలు అని రాసుకొచ్చారు. తలకిందులుగా నడవడం అని కష్టంగా భావించి.. బ్రిడ్జి కట్టినట్లున్నాయని దానికి యాడ్ చేస్తూ మరో పోస్టు పెట్టాడు.