ఆ పాట‌కు ప్ర‌పంచంలోనే అత్య‌ధిక వ్యూస్, యూట్యూబ్‌లో ఈ (Baby Shark) పాటకు ఎవరైనా ఫిదా కావాల్సిందే

  • Published By: sreehari ,Published On : November 3, 2020 / 02:25 PM IST
ఆ పాట‌కు ప్ర‌పంచంలోనే అత్య‌ధిక వ్యూస్, యూట్యూబ్‌లో ఈ (Baby Shark) పాటకు ఎవరైనా ఫిదా కావాల్సిందే

Baby Shark: సౌత్ కొరియన్ కంపెనీ రికార్డు చేసిన కిడ్స్ రైమ్.. ‘డుడుడుడు.. బేబీ షార్క్‌ డుడుడు … పింక్ ఫాంగ్ బేబీ షార్క్ అనే వీడియో సాంగ్‌కు ప్రపంచంలోనే అత్యధిక వ్యూస్ వచ్చాయి. సింగర్ లూయిస్ ఫోన్సీ అనే సింగర్ పాడిన ఈ వీడియో సాంగ్‌‌‌కు 7.04 బిలియన్ల వ్యూస్ వచ్చాయి.



7 వందల కోట్లకు పైగా మంది ఈ వీడియోను వీక్షించారు. పిల్ల‌ల పాటే అయినా అందరిని ఆకట్టుకుంటోంది. బేబీ షార్క్ అనే ఈ వీడియో సాంగ్‌ను నిరంతరయంగా ఏళ్ల పాటు 30,187 స్ట్రీమింగ్ అవుతోంది.



2016లో దక్షిణ కొరియాలో తొలుత ఆవిష్క‌రించిన ఈ పాట‌ ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌ అవుతోంది. ఇంగ్లీష్‌లో ఉంటే ఈ బేబీ షార్క్‌ సాంగ్ వినడానికి ఎంతో అర్థవంతంగా ఉందని అంటున్నారు. పాటకు త‌గ్గ‌ట్టు ఇద్దరు చిన్నారులు చ‌క్క‌ని డ్యాన్స్ వేస్తూ అందరిని అల‌రిస్తారు.



యూట్యూబ్ స్ట్రీమింగ్‌లో పింక్ ఫాంగ్ ఒకటి మాత్రమే 5.2 మిలియన్ డాలర్లు (4మిలియన్ ఫౌండ్లు)తో రికార్డు సృష్టించింది. ఈ పాట యూట్యూబ్ టాప్ మోస్ట్ ప్లేయిడ్ చార్టులో చేరడానికి నాలుగు ఏళ్లు సమయం పట్టింది. కానీ, ఈ పాట పాతదే అయినప్పటికీ యూట్యూబ్ వీక్షకుల్లో ఎంతో మందిని అలరిస్తోంది.