Bride injured: పెళ్లి వేడుకల్లో పెళ్లికూతురికి గాయాలు

సంబరాలు ఆమె ప్రాణాల మీదకు తెచ్చాయి. జీవితంలో స్పెషల్ మూమెంట్ అయిన పెళ్లి వేడుకే ఆమెను ప్రమాదంలోకి నెట్టింది. పెళ్లి వేడుకల్లో జరిపిన బాణాసంచా కాల్పులు పెళ్లికూతురి ప్రాణాల మీదకు తీసుకొచ్చాయి.

Bride injured: పెళ్లి వేడుకల్లో పెళ్లికూతురికి గాయాలు

Bride Injuries

Bride injured: సంబరాలు ఆమె ప్రాణాల మీదకు తెచ్చాయి. జీవితంలో స్పెషల్ మూమెంట్ అయిన పెళ్లి వేడుకే ఆమెను ప్రమాదంలోకి నెట్టింది. పెళ్లి వేడుకల్లో జరిపిన బాణాసంచా కాల్పులు పెళ్లికూతురి ప్రాణాల మీదకు తీసుకొచ్చాయి. బీహార్ లోని సుపాల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. స్టేజి మీద పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఉండగా కింద టపాసులు లాంటివి కాల్చుతూ వేడుక జరుపుతున్నారు.

సరిగ్గా అదే సమయంలో వాళ్లు దండలు మార్చుకుంటూ ఉండటంతో వస్తున్న ప్రమాదాన్ని గుర్తించలేకపోయారు. కెమెరా వైపు చూస్తుండగానే టపాసు పేలిన శబ్దంతో వెంటనే స్టేజి మీద పడిపోయింది. హుటాహుటిన హాస్పిటల్ కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.