మనుషుల గుంపును చూసి పారిపోతున్న పులి వీడియో వైరల్

  • Published By: dharani ,Published On : June 24, 2020 / 05:00 AM IST
మనుషుల గుంపును చూసి పారిపోతున్న పులి వీడియో వైరల్

వన్యప్రాణులు ఈ మధ్య కాలంలో నగరాల్లోకి, పట్టణాల్లోకి ప్రవేశించడం చాలా ఈజీగా స్వేచ్చగా తిరుగుతూ ఉన్నాయి. కొన్ని రోజులుగా గమనిస్తే వన్యప్రాణులు సమాజంలో స్వేచ్చగా తిరుగుతున్న కనిపించిన వీడియోలు చాలా ఉన్నాయి. అలాంటిదే ఓ పులి సమాజంలోకి ప్రవేశించిన హాల్ చల్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

గుజరాత్ లోని ఓ అటవీ ప్రాంతం నుంచి పట్టణంలోకి ప్రవేశించిన పులిని చూడవచ్చు. ఆ పులిని ఓ గుంపు నుంచి తనను తాను రక్షించుకోవటానికి కోసం ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి పరిగెత్తటం వీడియోలో చూడవచ్చు. అంతేకాకుండా జాగ్రత్తగా గమనిస్తే ఆ పులిని చూసి పారిపోతున్న ఓ గుంపు కనిపిస్తుంది. 

ఈ వీడియోని ఇండియన్ ఫారెస్టు ఆఫీసర్ సుశాంత్ నందా ట్విట్టర్ లో షేర్ చేశారు. వీడియోని షేర్ చేసిన కొన్ని గంటల్లోనే వైరల్ అయ్యింది. దానితో పాటు చాలా లైకులను సంపాదించుకుంది. 3.7 వేల మంది పైగా వీక్షించారు.

Read:  పాము కాదు, స్పైడర్ కాదు…మరో వింత జీవి