వీధి కుక్క విశ్వాసం: ఆకలి తీర్చినందుకు కన్నీటితో ఎలా కృతజ్ఞతలు చెప్పిందో చూడండీ..

వీధి కుక్క విశ్వాసం: ఆకలి తీర్చినందుకు కన్నీటితో ఎలా కృతజ్ఞతలు చెప్పిందో చూడండీ..

china stray dog cries when stranger feeds her : విశ్వాసం పెంపుడు కుక్కలకే కాదు..గుప్పెడంత ఆహారం పెడితే వీధి కుక్కలు కూడా విశ్వాసాన్నిచూపిస్తాయని ఓ వీధికుక్క నిరూపించింది. చైనాలో ఆకలితో నకనకలాడిపోతున్న ఓ వీధికుక్కకు ఓ మహిళ ఆహారం పెట్టింది. అంతే ఆమెకు ఈ కుక్క కన్నీటితో కృతజ్ఞతలు చెప్పిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

ఉత్తర చైనాలోని షాంక్సీ ప్రావిన్స్‌లో ఓ మహిళ జింగ్ హాంగ్ నగరంలో ఓ రోజు పార్క్‌కి వెళ్లింది. అక్కడ ఆమెకు ఓ వీధి కుక్క కనిపించింది. ఆకలితో పాపం అది నకనకలాడిపోతోంది. ఆ కుక్క ఆమె దగ్గరకు వచ్చింది. తన ముందు కాళ్లను పైకెత్తి ఆమెను ‘‘ఆకలేస్తోంది ఏమన్నా పెట్టమన్నట్లు’’గా తాకుడూ పిలవడం మొదలు పెట్టింది.

అది చూసిన ఆ మహిళ పాపం దానికి ఎంత ఆకలిగా ఉందో అనుకుని తన దగ్గరున్న కొన్ని బిస్కెట్లు పెట్టింది. అంతే ఆ కుక్క పాపం ఆబగా వాటిని తినేసింది. దీంతో ఆ కుక్కకు ఆనందంతో కళ్ల వెంట నీళ్లు వచ్చాయి. ఎంతో సంతోషించినట్లు..నా ఆకలి తీర్చిన మీకు కృతజ్ఞతలు ఆ కుక్క కళ్లలో కనిపించింది.

ఆ తరువాత రోజు కూడా ఆ మహిళ మరోసారి అదే పార్క్‌కి వెళ్లింది. అంతకు ముందు రోజు తనకు ఆహారాన్ని ఇచ్చిన ఆమెను ఆ కుక్క గుర్తుపట్టింది. వెంటనే ఆమె వద్దకు వచ్చింది. ఆ మహిళ తన వద్ద ఉన్న బిస్కెట్లను మరోసారి పెట్టింది. ఈసారి కూడా బిస్కెట్లను తిన్న తర్వాత కుక్క కళ్లలో మరోసారి నీళ్లు వచ్చాయి.

ఈ వీడియో చైనా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ కుక్కను, దానికి ఆహారం పెట్టిన మహిళను నెటిజన్లు అభినందిస్తున్నారు. దయచేసి మీకు కూడా ఎక్కడైనా కుక్కలు ఆకలితో కనిపిస్తే వాటికి ఆహారం పెట్టి కడుపు నింపండి అంటూ సలహాలిస్తున్నారు.