గాల్లో భలే ఎగిరాడు భయ్యా… CPL-2020లో బౌలర్ Kevin Sinclair డేంజరస్ డబుల్ ఫీట్..!

  • Published By: sreehari ,Published On : September 4, 2020 / 03:13 PM IST
గాల్లో భలే ఎగిరాడు భయ్యా… CPL-2020లో బౌలర్ Kevin Sinclair డేంజరస్ డబుల్ ఫీట్..!

#CPL20 #CricketPLayedLouder : క్రికెట్లో బ్యాట్స్ మెన్ మాత్రమే కాదు.. బౌలర్లు కూడా తమదైన శైలిలో ఆకట్టుకుంటుంటారు.. మ్యాచ్ మధ్యలో ఏదైనా వికెట్ తీసినప్పుడు సంతోషంగా వినూత్నంగా సెలబ్రేట్ చేసుకుంటుంటారు.. క్రికెట్లో ఇలా చేయడం కొత్తేమి కాదు.. మైదానంలో ఫీల్డర్లు క్యాచ్ పట్టినప్పుడు కూడా ఇలానే సెలబ్రేట్ చేసుకుంటారు.. ఇప్పుడు బౌలర్లు కూడా ఇదే ఫాలో అవుతున్నారు.. క్రీజులో పాతుకుపోయిన బ్యాట్స్ మెన్ వికెట్ తీసినప్పుడు ఆ సంతోషాన్ని కొత్తగా సెలబ్రేట్ చేసుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు..



ఇప్పుడు కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) 2020 మ్యాచ్ లోనూ ఇదే జరిగింది.. ఇందులో ‌భాగంగా Guyana Amazon Warriors, Barbados Tridents జట్ల మధ్య హోరాహోరీగా మ్యాచ్ జరుగుతోంది.. బార్బడోస్ ట్రిడెంట్స్ బ్యాటింగ్ చేస్తోంది. ఈ మ్యాచ్ సమయంలో గయానా బౌలర్ వేసిన బంతికి వికెట్ పడింది.



అంతే.. గయానా బౌలర్ Kevin Sinclair ఆనందం పట్టలేకపోయాడు.. మైదానంలోనే ఎగిరి గంతేశాడు.. గాల్లోకి పల్టీలు కొడుతూ పిల్లిమెగ్గలు వేశాడు.. ఒకసారితో ఆగలేదు.. రెండోసారి కూడా అతి తక్కువగా ఎత్తులో somersault ప్రయత్నించాడు.. ఇది ఎంత డేంజరస్ అంటే.. కొంచెం అటు ఇటు అయిన బతకడం కష్టమే.. అలాంటి డేంజరస్ డబుల్ ఫీట్ వేసి అందరిని ఔరా అనిపించాడు.. తొలి ఫీట్ వేసినప్పుడు చాలా ఎత్తువరకు ఎగిరి పల్టీ వేశాడు..



ఆ తర్వాత రెండో ఫీట్ నేలకు అది తక్కువ ఎత్తులో మళ్లీ ప్రయత్నించాడు.. మైదానంలో అతడి ఫీట్ చూస్తున్నవారంతా ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు.. అదృష్టవశాత్తూ Kevin Sinclair డేంజరస్ డబుల్ ఫీట్‌లో సేఫ్ గా ల్యాండ్ అయ్యాడు.. దాంతో అక్కడివారంతా ఊపిరిపీల్చుకున్నారు.. ఇప్పుడీ Kevin Sinclair డేంజరస్ Double Somersault ఫీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది..