Viral video : ద్యావుడా..లైట్లతో చీర డిజైన్..ఒళ్లంతా వెలుగులేనమ్మా

  • Published By: nagamani ,Published On : November 27, 2020 / 02:44 PM IST
Viral video : ద్యావుడా..లైట్లతో చీర డిజైన్..ఒళ్లంతా వెలుగులేనమ్మా

Sari with lights : బాలీవుడ్ సూపర్ స్టార్ అబితాబ్ బచ్చన్ నటించిన ‘‘సారా జమానా హసీనో కా దీవానా’’ సాంగ్ గుర్తుండే ఉంటుంది. ఆ పాటలో అబితాబ్ లైట్లతో ధగధగా మెరిసిపోయే షర్ట్ వేసుకుని డ్యాన్స్ చేస్తాడు.



అటువంటివి సినిమాల్లో చూడటానికి బాగానే ఉంటాయి. కానీ అటువంటివి బైటవేసుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏదో వింతను చూసినట్లుగా చూస్తారు. ఇదిగో ఓ మహిళ ఏకంగా తన చీర మొత్తాన్ని ధగధగా మెరిసిపోయేలా లైట్లతో డిజైన్ చేయించుకుంది.



కళ్లు మిరిమిట్లు గొలిపే కాంతులతో మెరిసిపోతున్న ఆ చీరను చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. దీపావళి మొత్తం ఆమె చీర కట్టుకునే ఉందని అంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
https://10tv.in/us-newyork-couple-house-finds-66-whiskey-bottle-inside-wall/


ఈ వీడియో చూసి నెటిజనులు నోరెళ్లబెడుతున్నారు. ఈ వీడియోను చూస్తే మీరు కూడా ‘షాక్’ అవుతారు. మరి మీరు కూడా ఓ లుక్ వేయండీ ఈ ‘లైట్ల చీర’పై..

https://youtu.be/JRK8yPTEm9o