కరోనాతో మరణించిన యజమాని.. ఆస్పత్రి దగ్గర 3నెలలుగా కుక్క ఎదురుచూపు

  • Published By: dharani ,Published On : May 26, 2020 / 04:05 PM IST
కరోనాతో మరణించిన యజమాని.. ఆస్పత్రి దగ్గర 3నెలలుగా కుక్క ఎదురుచూపు

కుక్కకు విశ్వాసం ఎక్కువ అంటే ఇదే నేమో.. కోవిడ్ 19తో చనిపోయిన తన యజమాని కోసం 3నెలలుగా ఆస్పత్రిలోనే ఎదురుచూస్తుంది. ఒక్క ముద్దా అన్నం పెడితే చాలు పక్కనే రక్షణగా ఉంటూ.. మనకోసమే బ్రతుకుతాయి. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. మరి అసలు విషయమేంటో చూద్దాం.

చైనా వుహాన్ కు చెంగిన ఓ వ్యక్తి జియావో బావో అనే వ్యక్తి 7ఏళ్లుగా ఓ పెంపుడు కుక్కను పెంచుకుంటున్నాడు.  అయితే ఓ రోజు యజమానికి అనారోగ్య సమస్యతో  ఆస్పత్రికి వెళ్లాడు. తనతో జియావోను కూడా తీసుకెళ్లాడు. ట్రీట్మెంట్ కోసం వెళ్లిన బాధితుడికి టెస్ట్ లు చేయగా.. కరోనా ఉందని తెలిసింది. తెలిసిన ఐదురోజులకు మరణించారు. 
కానీ ఆ విషయం తెలియని కుక్క యజమాని 3నెలలుగా ఎదురుచూస్తుంది. ఆసుపత్రి సిబ్బంది కుక్కను గమనించి వేరే ప్రాంతంలో వదిలేశారు. కానీ  ఆ కుక్క మళ్లీ తిరిగి అదే ఆసుపత్రికి వచ్చింది. దీంతో సిబ్బంది కుక్కను జాగ్రత్తగా చూడడం స్టార్ట్ చేశారు. ఇక రీసెంట్ గా ఆ కుక్కని జంతు సంరక్షణ సంస్థకు అప్పగించారు. 
 
అయితే ఇలాగే 2009లో A Dogs Tale అనే సినిమా కూడా వచ్చింది. ఈ సినిమాలో కూడ కుక్క తన యజమాని కోసం 9 ఏళ్ల పాటు ఎదురు చూస్తుంది. తన యజమాని కోసం అన్నేళ్లు రైల్వే స్టేషన్ బయటేనే ఎదురు చూసింది. అందుకే అంటారు మనుషుల కన్నా కుక్కలకే విశ్వాసం ఎక్కువ అని.