బాతు మంచి మనస్సు : తన తిండిని చేపకు పెట్టింది

  • Published By: veegamteam ,Published On : January 16, 2020 / 06:38 AM IST
బాతు మంచి మనస్సు : తన తిండిని చేపకు పెట్టింది

స్నేహం అంటే ఒక మంచి మిత్రుడు అని అర్ధం. ఆపద సయమాల్లో మనకు తోడుగా ఉండి, సంతోషాలను పంచుకునేవాడు నిజమైన మిత్రుడు. కుటుంబం తర్వాత మనం ఎక్కువ ప్రేమించే వ్యక్తి అంటే స్నేహితుడు. అలాంటి స్నేహితుడు దొరకాలంటే అదృష్టం ఉండాలి.

స్నేహం అంటే ఒక మనుషుల్లోనే కాదు.. జంతువుల్లోను స్నేహం ఉంటుందనే విషయాన్ని తెలిపే ఒక వీడియోని ఫారెస్ట్ ఆఫీసర్ ప్రవీణ్ కశ్వాన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో చేప, బాతు మధ్య ఉండే మంచి స్నేహం గురించి తెలుప్తుంది.

సరస్సును ఆనుకుని కొన్ని బాతులు ఉన్నాయి. ఆ సరస్సులో ఉన్న చేపలు ఆహారం కోసం వెతుకుతూ ఉన్నాయి. ఆకలితో ఉన్న చేపలను గమనించిన బాతు తన ఆహారాన్ని ముక్కు సాహాయంతో చేపలకు అందించింది. అక్కడకు చాలా సంఖ్యలో చేపలు వచ్చాయి. వచ్చిన ప్రతి చేపకు ఆహారాన్ని అందిస్తూనే ఉంది.

దీంతో బాతుకు, చేపలకు మధ్య ఉన్న మంచి స్నేహానికి నిదర్శనం అని చెప్పవచ్చు. స్నేహానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఉంటుందా, అంటూ చేపకి బాతులాంటి ఓ మంచి స్నేహితుడు దొరికాడు అనే క్యాప్షన్ తో ఈ వీడియోని ప్రవీణ్ కశ్వాన్ పంచుకున్నారు.