సో క్యూట్ వీడియో : బుడ్డోడికి బుజ్జి బాతు సాయం   

  • Published By: veegamteam ,Published On : August 26, 2019 / 06:42 AM IST
సో క్యూట్ వీడియో : బుడ్డోడికి బుజ్జి బాతు సాయం   

మనుష్యుల్ని చూస్తే బాతులు ఆమడ దూరం వెళ్లిపోతాయి. గున గునా నడుచుకుంటూ పారిపోతాయి. కానీ ఓ బుజ్జిబాతు మాత్రం ఓపిలగాడికి సహాయం చేసింది. ఈ క్యూట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైలర్ గా మారింది. 

ఓ బాలుడి చెప్పు ఓ గుంతలో పడిపోయింది. అది తీసుకోవటానికి ట్రై చేశాడు. కానీ సాధ్యం కాలేదు. కానీ గుంతలో పడిపోయిన చెప్పును బాతు పట్టుకొచ్చి ఇచ్చింది. బాతు వచ్చి చెప్పును తన ముక్కున కరుచుకొని అతనికిచ్చే ప్రయత్నించింది. రెండు మూడు సార్లు దగ్గరకు వచ్చినట్లే వచ్చి జారిపోయింది.  

అయినా ఆ బుజ్జిబాతు వదల్లేదు..ఎలాగైతేనే చెప్పు పట్టుకొచ్చి..అదేనండీ ముక్కున కరచుకుని తెచ్చి ఇచ్చింది. బాతు అందించిన చెప్పు పట్టుకుని బుడ్డోడు తుర్రుమన్నాడు. తరువాత ఆ బాతు కూడా ఆ గుంతలోంచి బైటకొచ్చింది.ఓఓ నేను సాధించానోచ్..అంటు రెక్కలు టపటపా కొట్టి మరీ చెప్పింది.

సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ఈ వీడియోను చూసిన నెటిజన్స్‌ బాతు చేసిన సహాయానికి ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ఆ బాతు ఆ పిల్లాడి పెంపుడు బాతా కాదా అనేది మాత్రం తెలియదు. కాకపోతే..చేసే పని అవ్వటంలేదు కదాని దాన్ని అలాగే వదిలేయకుండా ప్రయత్నిస్తే…సాధ్యపడుతుంది అనే మెసేజ్ కూడా ఈ బాతు ఇస్తున్నట్లుగా ఉంది కదూ.ఏది ఏమైనా ఈ బాతు వీడియో సో క్యూట్ గా ఉందబ్బా..