Fevicol: ఫెవికాల్ క్రియేటివిటీ మాములుగా లేదుగా.. పంచ్ అదిరింది!

మానవ సంబంధాలను పెనవేస్తూ.. ఫెవికాల్ బంధం అంటూ హృదాయానికి హత్తుకునే అడ్వర్టైజ్‌మెంట్ రూపొందించడంలో పేరున్న ఫెవికాల్ సంస్థ.. ఓ సరికొత్త అడ్వర్‌టైజ్‌మెంట్‌తో నెటిజన్ల ప్రశంసలు అందుకుంటుంది.

Fevicol: ఫెవికాల్ క్రియేటివిటీ మాములుగా లేదుగా.. పంచ్ అదిరింది!

Fevicol

Harsh Goenka Tweet: మానవ సంబంధాలను పెనవేస్తూ.. ఫెవికాల్ బంధం అంటూ హృదాయానికి హత్తుకునే అడ్వర్టైజ్‌మెంట్ రూపొందించడంలో పేరున్న ఫెవికాల్ సంస్థ.. ఓ సరికొత్త అడ్వర్‌టైజ్‌మెంట్‌తో నెటిజన్ల ప్రశంసలు అందుకుంటుంది. ఫెవికాల్ సంస్థ మార్కెటింగ్ స్ట్రాటజీకి నెటజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. క్రియేటివిటీకి సలాం కొడుతున్నారు. మరికొందరైతే సరదాగా కామెంట్లు చేస్తూ నెట్టింట్లో ఫెవికాల్‌ను ట్రెండ్ చేస్తున్నారు.

అసలు విషయానికి వస్తే, ఇటీవల కొకొకోలా కంపెనీకి సంబంధించిన రెండు బాటిళ్లను పక్కనపెట్టి, నీళ్లు తాగండంటూ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో హింట్ ఇచ్చాడు. దీంతో సదరు కంపెనీకి రూ. 29వేల కోట్ల నష్టం వచ్చింది. ఈ సంధర్భాన్ని ఫెవికాల్ కంపెనీ, వారికి అనుకూలంగా మార్చుకుంది. ప్రెస్‌కాన్ఫరెన్స్‌ టేబుల్‌పై కోక్‌ బాటిళ్లకు బదులు రెండు ఫెవికాల్‌ బాటిళ్లను పెట్టి.. ‘దీన్నెవరు జరపలేరు.. విలువ పడిపోదు’ అంటూ కామెంట్ పెట్టింది. దీనిపై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

ఫెవికాల్‌ అద్భుతమైన మార్కెటింగ్‌ వ్యూహం అనుసరించిందంటూ.. వ్యాపారవేత్త హర్ష్ గొయెంకా ట్వీట్‌ చేయగా.. ఈ ట్వీట్ నెట్టింట్లో హల్‌చల్ చేస్తుంది.