Chetan Bhagat: చేతన భగత్ జాక్‌పాట్.. కార్ రేసర్ లిఫ్ట్ ఇచ్చి ఎయిర్‌పోర్టులో డ్రాప్ చేస్తే..

ఎయిర్ పోర్టులో డ్రాప్ చేయడానికి కార్ మాజీ రేసర్ ను వాడేశారు చేతన్ భగత్. ఫార్ములా 1ను నడిపిన తొలి ఇండియన్ డ్రైవర్ నరైన్ కార్తికేయన్ సాయంతో సకాలంలో ఎయిర్‌పోర్టుకు చేరుకోగలిగాడు.

Chetan Bhagat: చేతన భగత్ జాక్‌పాట్.. కార్ రేసర్ లిఫ్ట్ ఇచ్చి ఎయిర్‌పోర్టులో డ్రాప్ చేస్తే..

Chetan Bhagat (1)

Chetan Bhagat: ఎయిర్ పోర్టులో డ్రాప్ చేయడానికి కార్ మాజీ రేసర్ ను వాడేశారు చేతన్ భగత్. ఫార్ములా 1ను నడిపిన తొలి ఇండియన్ డ్రైవర్ నరైన్ కార్తికేయన్ సాయంతో సకాలంలో ఎయిర్‌పోర్టుకు చేరుకోగలిగాడు. ఫార్ములా 1 మాజీ రేసర్ నరైన్ కార్తికేయన్ ఆఫర్ చేయడంతో Porsche 911 GT3 స్పోర్ట్స్ కారులో చేతన భగత్ చేసిన ప్రయాణం వీడియో వైరల్ అయింది.

ఈ ప్రయాణం జరుగుతుండగా చేతన్.. తనకు నరైన్ ఎందుకు సహాయం చేశాడనే విషయంపై మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వీడియోను అతని అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్ లో అప్ లోడ్ చేశారు. అతను తమిళనాడులోని కొయంబత్తూరులో ఉండగా దాదాపు తాను ఎక్కాల్సిన ఫ్లైట్ మిస్ అయిపోతుందనుకున్నాడట.

ఆ సమయంలో వేరే ట్రాన్స్ పోర్ట్ లో వెళ్లినా అక్కడికి చేరులేననుకుంటున్న సమయంలో నరైన్ సహాయం చేస్తానని ముందుకొచ్చాడు. అంతే అసలే స్పోర్ట్స్ కార్.. పైగా నడిపేది కార్ రేసర్ ఇక ఆలోచించకుండా కార్ ఎక్కేశాడట చేతన్. స్మూత్ గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి టైంకు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.

ఈ వీడియోలో రోడ్ పై ఉన్న ట్రాఫిక్, అయినప్పటికీ స్పీడ్ గా డ్రైవ్ చేసిన నరైన్ ను గురించి తెలుస్తూనే ఉంది. గతంలో నరైన్ నడిపిన 911 GT3కార్ టాప్ స్పీడ్ గురించి చేతన్ అడగ్గా.. మూడొందలకు మించిన వేగంతో ప్రయాణించగలదని చెప్పారు నరైన్. 2018లో ఆ మోడల్ ను రూ.3కోట్లకు పైగా వెచ్చించి కొనుగోలు చేశారట.

Porsche 911 GT3లో ఉండే పవర్‌ఫుల్ మెషీన్ రోడ్ పైనా, ట్రాక్ పైనా రెండు విధాల డ్రైవ్ చేయడానికి డిజైన్ చేశారు. 4.0లీటర్లతో ఆరు సిలిండర్ల, టర్బో బాక్సర్ ఇంజిన్ తో ఉంటుంది. ఈ ఇంజిన్ నుంచి 493 బీహెచ్ పీతో 540ఎన్ఎమ్ తో పీక్ స్పీడ్ లో దూసుకెళ్తుంది. రెండు సీట్లు మాత్రమే ఉండే సూపర్ కార్ రెడ్ కలర్ లో దొరుకుతుంది. 6 స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్స్ తో పాటు 7 స్పీడ్ ట్విన్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో 3.4 నుంచి 3.9 సెకన్లలోనే 0 నుంచి 100కిలోమీటర్ల వేగాన్ని పుంజుకోలగలదు.