సూపర్ ఐడియా.. పూల మొక్కలతో వెడ్డింగ్ ఇన్విటేషన్

  • Published By: veegamteam ,Published On : November 29, 2019 / 05:02 AM IST
సూపర్ ఐడియా..  పూల మొక్కలతో వెడ్డింగ్ ఇన్విటేషన్

పెళ్లంటే పందిళ్లు, చప్పట్లు తాళాలు, తలంబ్రాలు.. వీటితో పాటు పెళ్లి కార్డులు కూడా ఇంపార్టెంటే.. అయితే కార్డ్స్ సెలక్షన్లో ఒక్కోరు ఒక్కో లాగా సెలెక్ట్ చేసుకుంటారు. ప్రస్తుతం ఇప్పుడంతా ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ చేసుకుని వాట్సప్ లో షేర్ చేసేస్తున్నారు. అయితే, ఎక్కువ శాతం పేద, మధ్యతరగతి వారంతా మామూలు పేపర్‌ కార్డులను వాడుతుంటారు. అయితే ఈ క్రమంలో భోపాల్ లోని ఒక జంట పెళ్లి కోసం ఎలాంటి కార్డులు సెలక్ట్ చేసుకున్నారో తెలుసా..?

భోపాల్ లోని ఓ కుటుంబం పెళ్లి కార్డులను పూల మొక్కల రూపంలో అందరికి ఇచ్చారు. పర్యావరణ హితంగా ఉండేలా పెళ్లి కార్డులను తయారు చేయించారు. ఎందుకంటే పెళ్లి తర్వాత అందరూ ఆ కార్డులను వృద్ధాగా పాడేస్తారు. అందుకే వారు ఈ అద్భుతమైన ఐడియాను వాడారు. నలుగురికి ఉపయోగపడలన్నదే తమ లక్ష్యం అని చెప్పారు.

ఇక ఆ పెళ్లి కార్డులను చూసిన బంధువులు, స్నేహితులు, స్థానికులు సైతం వారిని ఎంతగానో అభినందిస్తున్నారు. ఇలా ఎవరికి తోచిన విధంగా వారు గ్రీన్‌ చాలేంజ్‌ ను స్వీకరిస్తూ.. వాతావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రయత్నించండి అని చెప్పారు.