ధూంధాం అని పెళ్లి చేసుకున్నాడు…. లాక్ డౌన్ రూల్స్ పాటించలేదని పోలీసులు లాక్కెళ్లి లోపలేశారు!

  • Published By: sreehari ,Published On : July 6, 2020 / 08:10 PM IST
ధూంధాం అని పెళ్లి చేసుకున్నాడు…. లాక్ డౌన్ రూల్స్ పాటించలేదని పోలీసులు లాక్కెళ్లి లోపలేశారు!

అసలే కరోనా సీజన్.. సామాజిక దూరం తప్పక పాటించాల్సిన సమయం. అందులోనూ కోవిడ్-19 గైడ్ లైన్స్ అమల్లో ఉన్నాయి. అయినా పట్టించుకోలేదు.. పెళ్లి ఘనంగా చేసుకోవాలనుకున్నాడు. పెళ్లి ఊరేగింపుతో పెళ్ల మంటపానికి బయల్దేరాడు ఒడిషా వరుడు. ఒడిశాలోని బెర్హాంపూర్‌లో పెళ్లి ఊరేగింపు సందర్భంగా ఒడిశా పోలీసులు వరుడితో సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు.

కోవిడ్ -19 మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు అరెస్టు చేశారు. ఒక హోటల్ ప్రాంగణంలో 50 మందికి పైగా అతిథులతో వివాహ ఊరేగింపు నిర్వహించాడు. ఈ సంఘటన జూలై 2న జరిగిన COVID-19 మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు కేసు నమోదైంది. తప్పనిసరిగా మాస్క్ వాడకాన్ని విస్మరించారు. సామాజిక దూర నిబంధనలను ఉల్లంఘించారని DIG సెంట్రల్ జోన్ సత్యబ్రాతా భోయ్ చెప్పారు.

సెక్షన్ 188/269/270 IPC, R/W సెక్ -3 ఎపిడెమిక్ డిసీజ్ యాక్ట్, 34 IPC కింద గోపాల్పూర్ పోలీసు స్టేషన్ వద్ద కేసు నమోదైంది. ఊరేగింపులో ఉపయోగించిన రెండు వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వ్యక్తులను కోర్టులో హాజరుపరుస్తామని అన్నారాయన. COVID-19 నిబంధనలను ఉల్లంఘించినందుకు జిల్లా కలెక్టర్ హోటల్‌కు స్వాధీనం చేసుకున్నారు.

ఈ సంఘటన తరువాత సీఎం ఆఫీసు ట్వీట్ చేసింది. COVID-19కి వ్యతిరేకంగా పోరాటంలో ఒడిశా కీలక దశలో ఉంది. COVID-19 వ్యాప్తిని నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు, నిబంధనలను అందరూ పాటించడం చాలా అవసరమని అన్నారు.