మహిళ ప్రసవం జరుగుతుండగా ఫొటోలు తీసిన ఆస్పత్రి సిబ్బంది

  • Published By: veegamteam ,Published On : May 7, 2019 / 04:06 PM IST
మహిళ ప్రసవం జరుగుతుండగా ఫొటోలు తీసిన ఆస్పత్రి సిబ్బంది

ఖమ్మం జిల్లాలోని మాతా శిశు ఆరోగ్యం కేంద్రంలో సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రసవం జరుగుతున్న మహిళ ఫొటోలు తీసి వాట్సప్‌లో పోస్టు చేశారు. కాన్పు సమయంలో ఫొటోలు తీయడం నిషేధమయినప్పటికీ ఆస్పత్రిలోని నర్సుల ప్రవర్తనపై అధికారులు, మహిళలు మండిపడుతున్నారు. 

మే 3న పురిటినొప్పులతో ఓ గర్భిణి ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి వచ్చింది. ఆస్పత్రిలో వైద్యులు ఎవరూ లేకపోవడంతో… నర్సులే కాన్పు చేశారు. కాన్పు చేస్తున్న సమయంలో ఆస్పత్రి సిబ్బంది ఫొటోలు తీశారు. సాధారణ కాన్పు చేయడం ద్వారా తామేదో సాధించామని చెప్పుకునేందుకు వాటిని వాట్సప్‌లో షేర్ చేశారు. ఇప్పుడీ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో.. ఈ వ్యవహారం వివాదాస్పదమైంది. మహిళల మనోభావాలు దెబ్బతీసేవిధంగా నర్సులు ప్రవర్తించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో డెలవరీ సమయంలో మహిళ ఫొటోలు చిత్రీకరించడంపై 10టీవీలో ప్రసారమైన వార్తలపై కలెక్టర్‌ స్పందించారు. ఆస్పత్రి నిర్వాకంపై  సీరియస్‌ అయ్యారు.  విచారణ కమిటీ వేసి.. నివేదిక ఇవ్వాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.