ఆపరేషన్ థియేటర్‌లో గవర్నమెంట్ డాక్టర్ Tiktok వీడియో..!!

  • Published By: veegamteam ,Published On : February 24, 2020 / 08:36 AM IST
ఆపరేషన్ థియేటర్‌లో గవర్నమెంట్ డాక్టర్ Tiktok వీడియో..!!

Tiktok వీడియోల పిచ్చి పీక్ స్టేజీలకు వెళుతోంది. ఆపరేషన్ థియేటర్లో ఓ గవర్నమెంట్ డాక్టర్ చేసిన Tiktok వీడియో వైరల్గా మారింది. ఈ ఘటన తెలంగాణ… హుజూరాబాద్ నియోజకవర్గంలో జరిగింది. ఈ వీడియోను  ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అదికాస్తా వైరల్ గా మారింది.

హుజూరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, ఆయన బృందం ఆపరేషన్ థియేటర్ లో ఓ పేషెంట్ కు ఆపరేషన్ చేస్తూ..టిక్ టాక్ వీడియో చెయ్యడం తీవ్ర దుమారం రేపింది. ఆపరేషన్ థియేటర్‌లో ఆపరేషన్ చేస్తూ… టిక్ టాక్ చెయ్యడమేంటని నెటిజన్లు మండిపడుతున్నారు. ఆ పేషెంట్ కు ఏమన్నా అయితే బాధ్యత ఎవరిది? డాక్టర్ అయి ఉండి అందునా ఓ పేషెంట్ కు ఆపరేషన్ చేస్తూ ఇటువంటి వేషాలు ఏంటీ అంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పేషెంట్ల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడుతున్నారు. 

ఈ వీడియోలో… డాక్టర్, ఆయన బృందం ఆపరేషన్ చేస్తున్నట్లు కనిపిస్తున్నా… తమిళ హీరో విజయ్ తెలుగు డైలాగ్స్ టిక్ టాక్ వీడియోలో వినిపిస్తున్నాయి. డాక్టర్లు టిక్ టాక్ వీడియో కోసం పోజులు ఇచ్చినట్లుగా ఉండటం తీవ్ర కలకలం రేపుతోంది. డాక్టర్ మాత్రం ఈ వీడియోతో తనకు ఎలాంటి సంబంధమూ లేదంటున్నారు.

దీనిపై స్పందించిన సదరు డాక్టర్ మాత్రం తాము టిక్ టాక్ వీడియో చెయ్యనేలేదని..ఎవరో తమకు తెలియకుండా ఈ వీడియో తీసి…దానికి డైలాగ్స్ కూడా సెట్ చేసి… టిక్‌టాక్‌లో పెట్టారని అంటున్నారు. కాగా..గతంలో ఓ ప్రైవేటు హాస్పిటల్ లో డాక్టర్ గా పనిచేసే గంగనారెడ్డి ఆపరేషన్ చేస్తూ టిక్ టాక్ వీడియో తీసి అప్ లోడ్ చేయటం వివాదంగా మారింది.