డబ్బే డబ్బు : పురుగులతో స్నాక్స్

  • Published By: madhu ,Published On : January 18, 2019 / 07:15 AM IST
డబ్బే డబ్బు : పురుగులతో స్నాక్స్

జపాన్ : పురుగులతో స్నాక్స్ ఏంటీరా బాబు…కానీ కొన్ని ప్రాంతాల్లో వీటినే ఆహారంగా తీసుకుంటుంటారు. జపాన్‌కి చెందిన 34 ఏళ్ల తోషియాకి తొమాడాకు ఓ ఆలోచన వచ్చింది. పురుగులతో స్నాక్స్ తయారు చేస్తే ఎలా ఉంటుంది ? అనుకున్నాడు. ఇతను బెలూన్ షాప్ నిర్వహిస్తున్నాడు. తన వ్యాపారంపై స్నేహితులతో చర్చించాడు. వెంటనే కుమామోటోట్ నగరంలో మంచి సెంటర్ చూసుకున్నాడు. 2018, నవంబర్ మాసంలో వెండింగ్ మెషిన్ పెట్టాడు. ఇందులో సాలీళ్లు..బొద్దింకలు..మిడతలు..అనేక పురుగులు వేసి స్నాక్స్ తయారు చేశాడు. స్టార్ట్ చేసిన నెల రోజుల్లోనే 500 రకాల స్నాక్స్ అమ్ముడయ్యాయి. వీటి ద్వారా ఒక్క నెలలోనే రూ. 3.27 లక్షల ఆదాయం వచ్చిందంట. ఈ వ్యాపారం మూడు బొద్దింకలు..ఆరు మిడతలుగా కొనసాగుతోంది. మంచి లాభాలే వస్తున్నాయి..మరి….